PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సంక్షేమం.. అభివృద్దే.. జగనన్న ధ్యేయం..

1 min read

జగనన్న పాలన.. పేదలకు పండగ : మంత్రి ఆదిమూలపు సురేష్‌

  • బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీల సాధికారత జగనన్న వల్లే సాధ్యమైంది : మంత్రి గుమ్మనూరు జయరాం
  • జగనన్న పాలనా కాలం… పేదలకు కలిసొచ్చిన కాలం : ఎంపీ సంజీవ్‌కుమార్‌
  • సంక్షేమ పథకాలు పేదల ఆర్థిక స్థాయిని పెంచాయి : ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌
  • కర్నూలులో సామాజిక సాధికారత యాత్ర.. సక్సెస్​..

పల్లెవెలుగు: కర్నూలు నియోజకవర్గంలో సామాజిక సాధికార బస్సు యాత్ర విజయవంతమైంది.  కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ ఆధ్వర్యంలో జరిగిన  బహిరంగసభలో మంత్రులు ఆదిమూలపు సురేష్, గుమ్మనూరు జయరాం, ఎంపీ సంజీవ్‌కుమార్, మాజీమంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్, మాజీ ఎంపీ బుట్టారేణుక, మాజీ ఎమ్మెల్యే మోహన్‌రెడ్డిలతో పాటు స్థానిక సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. నాయకుల ఉపన్యాసాలు బాగా సాగాయి.  అంతకు ముందు కర్నూలు పాత బస్టాండ్​లోని డా.బి.ఆర్​. అంబేద్కర్​ నుంచి పాత బస్తీలోని వన్​ టౌన్​ పోలీస్​స్టేషన్​ వరకు బస్సు యాత్ర సాగింది.. అనంతరం జరిగిన బహిరంగ సభలో మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే, నగర మేయర్​ తదితరులు మాట్లాడారు.

జన హృదయ నేత…జగనన్న:మంత్రి ఆదిమూలపు సురేష్‌

జనహృదయ నేత జగనన్న. ఆయన ప్రజల గుండెల్లో ఎంతగా ఉన్నారన్నది ఈ బహిరంగసభలో స్పష్టంగా కనిపిస్తోంది. సమయం ఎంతవుతున్నా పట్టించుకోకుండా, ఈ సభలో ప్రజలందరూ అలాగే ఉన్నారంటే ..జగనన్నపై ఎంత అభిమానం ఉందో అర్థమవుతోంది. నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలో సంక్షేమపథకాల వెల్లువ గురించి అందరికీ తెలిసిందే. సంక్షేమ పథకాలు లబ్దిదారులకు అందించే విషయంలోను.. జగనన్న విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారన్నారు.

పేదల కోసమే… జగనన్న పార్టీ : మంత్రి గుమ్మనూరు జయరాం

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలంతా కలిసి..నాయకులుగా ఇలా మీముందుకు వచ్చారంటే జగనన్న వల్లనే. ఆయన పార్టీ పెట్టడం వల్లే సామాజిక సాధికారత అంటే ఏమిటో మనకు తెలిసింది. జగనన్న పార్టీ పెట్టిందే పేదల కోసమే. రాష్ట్రంలో టీడీపీకి గ్యారంటీ లేదు. దానికి ష్యూరిటీ ఇచ్చేవాళ్లు లేరు. నాలుగున్నరేళ్లలో జగనన్న పాలనలో ఐదు కోట్లమంది ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు జరిగిన మంచి అంతా ఇంతా కాదు. ఆరోగ్యశ్రీ ద్వారా 25లక్షల విలువైన వైద్యసాయం అందేలా చేసిన పెద్దమనసు ఎవరికి ఉంటుంది?  జగనన్న లాంటి నాయకుడికే అలాంటి పెద్ద మనసు ఉంది. అందుకే ఆరోగ్యశ్రీ స్థాయిని పెంచి, పేదలకు మరింత భరోసా నిచ్చారు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి.

ఇది పేదల ప్రభుత్వం.. : ఎంపీ సంజీవ్‌కుమార్‌

బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీలకు ధైర్యాన్నిచ్చి, ఆత్మవిశ్వాసాన్ని నూరిపోసిన జగనన్న, మనల్ని గర్వంగా తలెత్తుకునేలా చేస్తున్నారు. మన పేదల పెన్నిధి జగనన్న. ఆయనను మళ్లీ మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం అందరిపై ఉందన్నారు.

పిల్లల భవిష్యత్​కు… జగనన్నే సీఎం కావాలి : ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌

మనం ప్రశాంతంగా బతకాలనుకుంటే, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే జగనన్నే ముఖ్యమంత్రిగా ఉండాలి. లంచాలు, వివక్ష అంటూ లేకుండా సంక్షేమపథకాలు ఇంటì  గడపదగ్గరే అందేలా చేయడం సామాన్యవిషయం కాదు. రూ.2.36లక్షల కోట్ల రూపాయలు డీబిటి ద్వారా లబ్దిదారుల ఖాతాలో వేసిన ఘనత జగనన్నదే. జగనన్న పథకాలు పేదల ఆర్థిక స్థాయిని పెంచాయి.   సామాజిక సాధికారతతో బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ వర్గాలకు రాజకీయ పదవులు ఇచ్చి, వారి సామాజిక స్థాయిని పెంచిన దార్శనిక పాలకుడు జగనన్న. ఇక కర్నూలులో ఎన్నో అభివృద్ధి పథకాలు జగనన్న హయాంలోనే సాధ్యమయ్యాయి. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజాపాలన అందిస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి. మరోసారి వైఎస్​ జగన్​ మోహన్​ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.

About Author