ప్రజల ఆరోగ్య పరిరక్షణే జగనన్న ధ్యేయం
1 min readపల్లెవెలుగు వెబ్ తుగ్గలి: పందికోన,ముక్కెళ్ల,బింగిదొడ్డి గ్రామాలలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ ప్రజల ఆరోగ్య పరిరక్షణ ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ కోరారు. పత్తికొండ మండలం పందికోన , తుగ్గలి మండలం ముక్కెళ్ల , వెల్దుర్తి మండలం బింగిదొడ్డి గ్రామాలలో వైద్య సిబ్బంది నిర్వహిస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శ్రీదేవమ్మ పరిశీలించారు. వైద్య సిబ్బంది గ్రామాలకే వచ్చి అవసరమైన పరీక్షలు చేసి మందులు ఇస్తారని తెలియజేశారు. ప్రాథమిక వైద్య పరీక్షల అనంతరం అవసరమైతే ఆరోగ్యశ్రీ కింద పెద్ద ఆసుపత్రులకు కూడా రెఫర్ చేసి మంచి వైద్యం ఉండేలా చూస్తారని తెలియజేశారు. జగనన్న ఆశయాలకు అనుగుణంగా సేవలు అందించాలని వైద్యులకు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పందికోన,ముక్కెళ్ల,బింగిదొడ్డి గ్రామాల వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.