చౌటుకూరులో జగనన్న సురక్ష..ప్రజలకు వరం
1 min readపల్లెవెలుగు వెబ్ మిడుతూరు: జగనన్న సురక్ష ప్రజలకు వరమని గ్రామాలకు వైద్య సిబ్బందిని పంపుతూ వైద్య శిబిరాల ద్వారా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఉపశమనం కలిగించడానికి ప్రభుత్వం ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసిందని ఎంపీడీఓ జిఎన్ఎస్ రెడ్డి అన్నారు.నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని చౌటుకూరు గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాలలో గురువారం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జగనన్న సురక్ష గ్రామ సర్పంచ్ మదార్ సాహెబ్ ఆధ్వర్యంలో జరిగినది.జనరల్ మెడిసిన్ కు కడుమూరు పిహెచ్ సి డాక్టర్ రాజు,తలముడిపి డాక్టర్ కిరణ్ తర్వాత స్త్రీల వైద్యనిపుణులు,చిన్నపిల్లల,కంటి వైద్యులు ప్రజల సమస్యలకు డాక్టర్లు తగిన సలహాలు సూచనలు ఇస్తూ వారికి మందులను పంపిణీ చేశారు.మధ్యాహ్నం నియోజకవర్గం ప్రత్యేక అధికారి రఘురాం పరిశీలించారు.ఈ శిబిరానికి మొత్తం 340 మంది హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో ఏఓ సురేష్ కుమార్ సీనియర్,అసిస్టెంట్ సురేష్ కుమార్,సిహెచ్ఓ రంగస్వామి,హెల్త్ అసిస్టెంట్ కరుణానిధి,సూపర్వైజర్ ఏసేపు,పంచాయతీ కార్యదర్శులు శివ కళ్యాణ్ సింగ్,బీజాన్ భీ, ఎన్.అనురాధ,రఘు,విఆర్ఓ రామయ్య, ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలు అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.