జగన్మోహన్ రెడ్డి దళిత ద్రోహి…
1 min readదళితులపైనే ఎస్సి ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిన చరిత్ర వైసీపీదే..
దళితులను వైసీపీ నాయకులు చంపి డోర్ డెలివరీ చేస్తున్నారు.
దళిత హంతకులకు వైసీపీ నాయకులు పాలాభిషేకాలు చేసి సన్మానిస్తున్నారు…
హంతకులను జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తున్నాడు…
స్థానిక వైసీపీ ఎమ్మెల్యే మాట కనీసం వలంటీర్లే వినడం లేదు..
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: జగన్మోహన్ రెడ్డి దళిత ద్రోహి దళితులను వైసీపీ నాయకులు చంపి డోర్ డెలివరీ చేస్తున్నారు. దళిత హంతకులకు వైసీపీ నాయకులు పాలాభిషేకాలు చేసి సన్మానిస్తున్నా. వారిని జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తున్నాడని ,డాక్టర్ సుధాకర్ తో మొదలై డాక్టర్ అచ్చెన్న వరకు దళితులపై వైసీపీ మారణకాండ, వేధింపుల పర్వం కొనసాగుతోందన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో దళితులపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. దళిత రైతుల చేతికి బేడీలు వేసి జైళ్లకు పంపిన జగన్ దళిత ద్రోహి అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వం పైన సీఎం జగన్ మోహన్ రెడ్డి పైన ఆరోపణలు చేశారు. దళితులకు జరిగిన అన్యాయంపై నేను మాట్లాడినందుకే నాపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. నాపై 20కేసులు పెట్టారని దుయ్యబట్టారు. నందికొట్కూరు నియోజకవర్గం, పాములపాడు గ్రామంలో ఎస్సీ లతో శుక్రవారం యువనేత లోకేష్ ముఖాముఖి సమావేశంలో నారా లోకేష్ మాట్లాడుతూ… ఏపీ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన దొంగ లెక్కలు బాగా రాస్తాడు. నిధులు కేటాయిస్తాడే తప్ప, ఖర్చు చేయడని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. టీడీపీ పరిపాలనలో దళితులకు ఖరీదైన వాహనాలు కొని స్వయం ఉపాధి కల్పించామని దళిత సంక్షేమానికి రూ.40వేల కోట్లు ఖర్చు చేశాం. 3వేల ఎకరాలు కొనుగోలు చేసి దళితులకు ఇచ్చామని తెలిపారు. దళిత విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడానికి బెస్ట్ అవైలబుల్ పాఠశాలలు, ఫీజు రీయింబర్స్ మెంట్ ఇచ్చామన్నారు. విదేశీవిద్య పథకాన్ని అమలు చేసి విదేశాల్లో చదివించామని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఈ పథకాలన్నింటినీ రద్దు చేశాడన్నారు .2014 ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టని పథకాలను కూడా చంద్రబాబు అమలు చేశారు. జగన్మోహన్ రెడ్డి దళితులకు సంబంధించిన 27 పథకాలు రద్దు చేశాడు. అంబేద్కర్ పేరును విదేశీవిద్య పథకానికి చంద్రబాబు పెడితే, జగన్ దానిని తీసేసి తన పేరు పెట్టుకున్నాడు. మేం అధికారంలోకి వచ్చాక దళితులకు జానాభా దామాషా ప్రకారం బడ్జెట్ కేటాయించి, ఖర్చు చేస్తాం. ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత విద్యనందించడానికి బెస్ట్ అవెయిలబుల్ స్కూల్స్ పథకం తెచ్చాం. దానిని జగన్ రద్దు చేశాడు. మేం అధికారంలోకి వచ్చాక ఈ పాఠశాలలను తిరిగి ప్రారంభిస్తామన్నారు.2014లో రూ.16వేల కోట్ల లోటు బడ్జెట్ లోనూ రాష్ట్రంలో సంక్షేమాన్నిఅందించిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో యువతకు ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేదని ఆరోపించారు.2025 జనవరిలో మేం మెగా డీఎస్సీ ప్రకటిస్తామని. 5ఏళ్లలో ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. రాయలసీమ ముద్దు బిడ్డనని చెప్పుకుంటున్న జగన్ ఈ రాయలసీమ కోసం ఏం చేశాడు అని ప్రశ్నించారు.ఎస్సీ కార్పొరేషన్ ద్వారా గతంలో 2.70లక్షల మందికి స్వయం ఉపాధి కల్పించాం. ఈసారి 5లక్షల మందికి ఉపాధి కల్పిస్తామన్నారు.చంద్రబాబు పాలనలో ఏనాడూ విద్యుత్ ఛార్జీలు పెంచలేదు. జగన్ వచ్చాక ఇప్పటికి 8సార్లు పెంచారన్నారు. మీరు కాల్చే ప్రతి యూనిట్ లో జగన్మోహన్ రెడ్డి రూ.1 లంచంగా తీసుకుంటున్నాడని ఎద్దేవాచేశారు. మేం అధికారంలోకి వచ్చాక విద్యుత్ ఛార్జీలను సమీక్షిస్తాం. దళితులకు 200యూనిట్లు విద్యుత్ ను ఉచితంగా అందిస్తాం. జగన్మోహన్ రెడ్డి వివిధ కారణాలతో కట్ చేసిన పెన్షన్లను మేం ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటాం. చంద్రబాబు పాలనకు ముందు ఉన్న ఏ పథకాన్ని మేం రద్దు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక చంద్రబాబు పాలనలో అమలైన పథకాలన్నీ రద్దు చేశాడు.కులం, మతం, ప్రాంతాల ప్రకారం ప్రజలను విడదీస్తోంది.మీ వివరాలు ఇవ్వండి. మీ పిల్లలను చదివించే బాధ్యతను మేం తీసుకుంటాం.మేం అధికారంలోకి వచ్చాక శ్రీశైలం ముంపు బాధితులను ఆదుకుంటాం. జీఓ98 ను అమలు చేస్తాం. మ్యానిఫెస్టోలో స్పష్టతనిస్తాం.ఆటో డ్రైవర్లకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం. ఇన్సూరెన్సు భారాన్ని తగ్గిస్తాం.అధికారంలోకి వచ్చాక పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తాం. జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక పోలీసులను ఫోటోగ్రాఫర్లుగా మార్చారు. వాళ్లకు టార్గెట్లు పెట్టి చలానాలు వేస్తున్నారు. ఎస్సీ వర్గీకరణ విధానం సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. కర్ణాటక లో ఎస్సీ వర్గీకరణ తీర్మానం చేశారు. చంద్రబాబు పాలనలో జి.ఓ 25 తెచ్చి దళిత సంక్షేమ పథకాలను ఉపకులాలకు అమలు చేశారు. 2014-19 మధ్య దళితులకు మేం ఏం చేశామో, జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో చర్చించడానికి మేం సిద్ధం. సాంఘిక సంక్షేమమంత్రి బహిరంగచర్చకు రావాలి. అసైన్డ్ ల్యాండ్ చట్టంపై రాష్ట్రంలో ఇంకా సందిగ్ధత నెలకొంది. కర్నాటకలో చట్టాన్ని అధ్యయనం చేసి త్వరలో మంచి నిర్ణయం తీసుకుంటాం. బెస్ట్ అవెయిలబుల్ స్కూల్ స్కీం, ఫీజు రీయింబర్స్ మెంట్, పీజీ ఫీజు రీయింబర్స్ మెంట్, విదేశీవిద్య పథకాలను చంద్రబాబు అమలు చేశారు. జగన్ వీటిని రద్దు చేశాడు. మేం అధికారంలోకి వచ్చాక దళిత యువతకు స్కిల్ డెవలప్ మెంట్ ద్వారా శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాం.మేం అధికారంలోకి వచ్చాక కేజీ టు పీజీ కాలేజీ సిలబస్ లో మార్పులు చేస్తాం. చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగాలు వచ్చేలా నైపుణ్యతతో కూడిన విద్యను అందిస్తాం. ఏపీ చరిత్రలో వైసీపీ పాలనలోనే దళితుల చేతిలో భూమి తగ్గింది. మేం అధికారంలోకి వచ్చాక భూమి కొనుగోలు పథకాన్ని కొనసాగిస్తాం. మేం అధికారంలోకి వచ్చాక మొదటి సంవత్సరంలోనే గ్రామాల్లో ఉన్న అంతర్గత రోడ్లను నిర్మిస్తాం. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే మాట కనీసం వలంటీర్లే వినడం లేదు.జగన్మోహన్ రెడ్డి దళిత ద్రోహి..దళితులను వైసీపీ నాయకులు చంపి డోర్ డెలివరీ చేస్తున్నారు. దళిత హంతకులకు వైసీపీ నాయకులు పాలాభిషేకాలు చేసి సన్మానిస్తున్నా. వారిని జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తున్నాడు.డాక్టర్ సుధాకర్ తో మొదలై డాక్టర్ అచ్చెన్న వరకు దళితులపై వైసీపీ మారణకాండ, వేధింపుల పర్వం కొనసాగుతోంది. జగన్మోహన్ రెడ్డి పాలనలో దళితులపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. దళిత రైతుల చేతికి బేడీలు వేసి జైళ్లకు పంపారు. దళితులకు జరిగిన అన్యాయంపై నేను మాట్లాడినందుకే నాపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. నాపై 20కేసులు పెట్టారు.జీఓ-01 రద్దు జగన్మోహన్ రెడ్డికి చెంపపెట్టు.డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం జీఓ-01ను ఓడించింది. రాజారెడ్డి రాజ్యాంగం ఓడింది.జీఓ-01 రద్దు జగన్మోహన్ రెడ్డికి చెంపపెట్టు లాంటిది. జీఓ ఇచ్చిన రోజే ఇది చెల్లదు అని జగన్ కు నేను చెప్పాను. నేడు అదే జరిగిందన్నారు.