NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జగన్‌మోహన్ రెడ్డి  ప్రజాకంఠక పాలనకు చరమగీతం..

1 min read

29న గుండుగొలను లొ రా కదలిరా..

బడేటి  చంటి పిలుపు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  : జగన్మోహన్‌ రెడ్డి ప్రజాకంఠక పాలనకు చరమగీతం పాడేందుకు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన రా కదలిరా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జ్‌ బడేటి చంటి పిలుపునిచ్చారు. ఏలూరు పవర్‌పేటలోని టిడిపి కార్యాలయంలో ఈ నెల 29వ తేదీన ఉంగుటూరు నియోజకవర్గం బీమడోలులో జరిగే రా కదలిరా కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలకు ముందు అచరణ సాధ్యం కాని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన సైకో జగన్ రాష్ట్ర ప్రజలకు నరకాన్ని చూపించారని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆయన ధ్వజమెత్తారు. అవినీతి సొమ్ముతో మళ్ళీ గద్దెనెక్కేందుకు వైసిపి ప్రయత్నిస్తోందని, అరాచక ప్రభుత్వానికి తగిన బుద్ది చెప్పేందుకు ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చంద్రబాబు నిర్వహిస్తున్న రా కదలిరా సభలు అనూహ్యమైన రీతిలో విజయవంతం కావడంతో వైసిపి నాయకులు, సీఎం జగన్‌లో వణుకు పుడుతోందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారని, రానున్న ఎన్నికల్లో వైసిపికి ఘోర పరాభవం తప్పదని బడేటి చంటి హెచ్చరించారు. ఈ సందర్బంగా ఆయన ఏలూరు లో నిర్వహిస్తున్న ప్రజా సంకల్ప యాత్ర బ్రోచర్, పోస్టర్ ను ఆవిష్కరణ చేశారు.

About Author