మళ్లీ సీఎంగా జగనన్న..ఐదింతలుగా పథకాలు
1 min read-ప్రతిపక్ష పార్టీ మాటలను ఎవ్వరూ నమ్మవద్దు
-అత్యధిక మెజార్టీతో గెలిపించండి
-వాలంటీర్లకు అభినందన సభలో డాక్టర్ సుధీర్
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి అయితే ఇప్పుడున్న పథకాలు 5 ఇంతలుగా అవుతాయని నందికొట్కూరు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ దార సుధీర్ అన్నారు.నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో గురువారం మ.12 గంటలకు జరిగిన వాలంటీర్లకు అభినందన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దార సుధీర్ హాజరయ్యారు. ముందుగా ఎంపీడీఓ గంగావతి మాట్లాడుతూ మండలానికి సేవావజ్రకు మిడుతూరు సుబ్బన్న -45 వేలు ఎంపిక అయ్యారని సేవరత్నకు 5 మంది రాజశేఖర్,రేణుక, శివరంజని,శివకృష్ణ,వరలక్ష్మి వీరందరికీ ఒక్కొక్కరికి 30 వేల రూపాయలు మరియు సేవా మిత్ర కు మిగతా వాలంటీర్లకు 15 వేలు అందజేస్తున్నామని ఆమె తెలిపారు.తర్వాత దారా సుధీర్ మాట్లాడుతూ వాలంటరీ వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలను ప్రతి పేదవాడికి అందించాలనే దృఢ సంకల్పంతో ఈ వాలంటరీ వ్యవస్థను తీసుకువచ్చారని మనందరి అభివృద్ధి కోసం వాలంటరీ వ్యవస్థను మనం కాపాడుకోవాలని ఈ సిస్టం ను మళ్లీ మన జగనన్నను ముఖ్యమంత్రిగా అధిక స్థానాల్లో మనం గెలిపించుకోవాలని అన్నారు. ప్రతి కుటుంబంతో మీకు తెలిసే ఉంటుంది పథకాల గురించి వారికి అర్థమయ్యే రీతిలో చెప్పి మన వైయస్సార్ ప్రభుత్వం వచ్చేటట్లు చేసే బాధ్యత మనందరి పైనా ఉందని ఈ వ్యవస్థ ఇంకా అభివృద్ధి చెందాలని మీరంతా చాలా కష్టపడుతున్నారు మహోన్నతమైన ఉద్యోగం ఈ సేవలో మీరు భాగ స్వాములు కావడం చాలా హర్షించదగ్గ విషయమని భారతదేశంలో ఎక్కడా కూడా ఈ వాలంటరీ వ్యవస్థ లేదని మన రాష్ట్రంలోనే జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక వ్యవస్థను తీసుకువచ్చారని అన్నారు.తదనంతరం వాలంటీర్లను శాలువా సర్టిఫికెట్ మెడల్స్ తో ఇన్చార్జి డాక్టర్ సుధీర్ మరియు ప్రజా ప్రతినిధులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మల్లు వెంకటేశ్వరమ్మ,ఐటీ వింగ్ జిల్లా అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ తువ్వా శివరామకృష్ణారెడ్డి,వైస్ ఎంపీపీ నబి రసూల్,వైసీపీ మండల కన్వీనర్ తువ్వా లోకేశ్వర్ రెడ్డి,మండల కో ఆప్షన్ సభ్యులు పెద్దమౌలా వివిధ గ్రామాల సర్పంచులు ప్రజా ప్రతినిధులు మరియు అధికారులు పాల్గొన్నారు.