ఆర్యవైస్యులకు అన్ని విధాలా అండగా జగనన్న
1 min read– అన్ని రంగాల్లో ఆర్యవైస్యులకు సముచిత స్థానం..
– ఆర్యవైశ్య కార్పొరేషన్ ద్వారా ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు అండ..
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : రాష్ట్ర వ్యాప్తంగా ఆర్యవైస్యులకు అన్ని విధాలా అండగా నిలుస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారికి అన్ని రంగాల్లో సముచిత స్థానం కల్పిస్తున్నారని రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి, ఏలూరు ఎమ్మెల్యే, ఏలూరు జిల్లా వైఎస్సార్ సిపి అధ్యక్షులు ఆళ్ల నాని అన్నారు.ఆర్ధికంగా వెనుకబడిన ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన పేద కుటుంబాలకు సైతము ఆర్యవైశ్య కార్పొరేషన్ నెలకొల్పి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని విధాలా అండగా నిలుస్తున్నారని ఆళ్ల నాని అన్నారు.ఏలూరులో జరిగిన గడప గడపకు కార్యక్రమంలో భాగంగా పవర్ పేట కు విచ్చేసిన మాజీ మంత్రి, ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని ప్రముఖ వ్యాపారవేత్తలు అంబికా బ్రదర్స్ ఆధ్వర్యంలో నగరంలోని ఆర్యవైశ్య ప్రముఖులు, వ్యాపారవేత్తలతో అంబికా ఇంటివద్ద జరిగిన ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.అంబికా సంస్థల చైర్మన్, ఏలూరు మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ , ఏలూరు అర్బన్ బ్యాంక్ చైర్మన్ అంబికా ప్రసాద్, ప్రముఖ వ్యాపారవేత్త, వైఎస్సార్ సిపి నాయకులు అంబికా రాజాలు ఆళ్ల నానికి ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా సామాజిక ,రాజకీయ రంగాలతో పాటు అన్ని రంగాల్లోనూ ఆర్యవైస్యులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సముచిత స్థానం కల్పిస్తున్నారని ఆళ్ల నాని తెలిపారు.ఏలూరులోని ఆర్య వైస్యులకు ఎల్లవేళలా అండగా నిలుస్తున్న ఆళ్ల నానిని అంబికా బ్రదర్స్ ఘనంగా సత్కరించి, జ్ఞాపికను అందచేశారు.ఈ కార్యక్రమంలో నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు, ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్ మధ్యాహ్నపు ఈశ్వరి బలరాం, డిప్యూటీ మేయర్లు నూకపెయ్యి సుధీర్ బాబు, గుడిదేసి శ్రీనివాస్, మార్కెట్ యార్డ్ చైర్మన్ నెరుసు చిరంజీవులు, వైస్ చైర్మన్ కంచన రామకృష్ణ, మహిళా అధ్యక్షురాలు నున్న స్వాతి కిషోర్, వైఎస్సార్ సిపి సీనియర్ నాయకులు MRD బలరాం, కో-అప్షన్ సభ్యులు SMR పెదబాబు, మున్నుల జాన్ గురునాధ్, రాష్ట్ర బ్రాహ్మణ సంఘ అధ్యక్షులు సత్యవాడ దుర్గా ప్రసాద్, నగర ఆర్యవైశ్య ప్రముఖులు MTV సత్య కుమార్, చక్కా రాజా, పయిడేటి రామారావు, చీమకుర్తి సాయి కృష్ణ, చన్నా వెంకట రామయ్య, సొందూరి అంజనేయులు ,మోతె చలపతి రావు, నెరేళ్ళ రాజేంద్ర, మద్దూరి రవి, గుడివాడ కిషోర్, రేవురి శివప్రసాద్, మోటామర్రి సదానంద్, పోకూరి శ్రీధర్, మడుపల్లి రత్నాకర్, చైతన్య, ప్రకాష్, సూర్యా వాటర్ గ్రూప్స్ గణేష్, కురాళ్ల రమాదేవి, గుడిమెట్ల బాబు, గుడిమెట్ల అచ్యుత, జయశ్రీ, వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్ మహ్మద్ అరీఫ్, రాష్ట్ర హిస్టరీ అకాడమి డైరెక్టర్ మహ్మద్ ఖైజర్ పాషా, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ జక్కుల బెనర్జీ, ఏలూరు టూటౌన్ మహిళా సమాఖ్య అధ్యక్షురాలు షేక్ అమీనా అన్సారీ, మైనార్టీ సెల్ అధ్యక్షులు మహ్మద్ రియాజ్ అలీ ఖాన్,ఆ కార్పొరేటర్లు జిజ్జువరపు విజయనిర్మల రమేష్, తుమరాడా స్రవంతి, యర్రంశెట్టి సుమన్, పిల్లంగోళ్ల శ్రీదేవి, పొలిమేర దాసు, పైడి భీమేశ్వర్ రావు, వంకదారు ప్రవీణ్, దేవరకొండ శ్రీనివాస్, కడవ కొల్లు సాంబా, సన్నీ, జయకర్, లీగల్ సెల్ నాయకులు ఆచంట వెంకటేశ్వరరావు, ప్రత్తిపాటి తంబీ, వైఎస్సార్ సిపి నాయకులు పొలిమేర హరికృష్ణ, జిజ్జువరపు రమేష్, నున్న కిషోర్, కీలాడి దుర్గారావు, బండారు కిరణ్, నిడికొండ నరేంద్ర, శివరావు, పొడిపిరెడ్డి నాగేశ్వరరావు, లూటుకుర్తి సుభాష్, ఇనపనూరి జగదీష్, దారపు తేజా, మోదుగు పుల్లారావు, పిట్టా ధనుంజయ్, , భారతి వెంకట రావు, ఏలూరు టౌన్ రైతు బ్యాంక్ చైర్మన్ దాసరి రమేష్, సుల్తానా, బోగిశెట్టి పార్వతి, వితాల చంద్రశేఖర్ సహా పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.