PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రేపు జగనన్న విద్యాదీవెన

1 min read

– ఆన్​లైన్​ వీసీలో ప్రారంభించనున్న సీఎం వైఎస్​ జగన్​
– జిల్లాలో లబ్ధి పొందనున్న 85,763 మంది విద్యార్థులు
– కలెక్టర్​ జి. వీరపాండియన్​ వెల్లడి
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: జగనన్న విద్యాకానుక లబ్ధిదారులకు సీఎం వైఎస్​ జగన్​మోహన్​ రెడ్డి ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాన్ని సోమవారం ఆన్​లైన్​ వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా లాంఛనంగా ప్రారంభించనున్నట్లు కర్నూలు కలెక్టర్​ జి. వీరపాండియన్​ తెలిపారు. ఆదివారం ఉదయం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి జగనన్న విద్యాదీవెన కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో చేయాల్సిన ఏర్పాట్లపై టెలి కాన్ఫరెన్సు ద్వారా సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.టెలి కాన్ఫరెన్సు జేసీ(సంక్షేమం) సయ్యద్ ఖాజా మొహిద్దీన్, డిడి సోషల్ వెల్ఫేర్ రమాదేవి, ఆర్డీవో లు, అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల స్పెషల్ అధికారులు, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ జి వీరపాండియన్ మాట్లాడుతూ కోవిడ్​ నిబంధనలు పాటిస్తూ.. నియోజకవర్గ ఎమ్మెల్యేల సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. 2020-21 సంవత్సరానికి సంబంధించి రెన్యువల్ స్టూడెంట్స్ 55,224 మంది విద్యార్థులు, 2020-21 సంవత్సరానికి సంబంధించి ఫ్రెషర్ స్టూడెంట్స్ 30,539 మంది విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన కింద ఆర్థిక లబ్ది పొందనున్నారన్నారు.
నియోజకవర్గాల వారీగా:

కర్నూలు రాయలసీమ యూనివర్సిటీ అకాడమిక్ బిల్డింగ్ సెకండ్ ఫ్లోర్ సెమినార్ హాల్, నంద్యాల శ్రీ రామకృష్ణ డిగ్రీ కాలేజ్ నంద్యాల, ఆళ్లగడ్డ కెవి సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, పత్తికొండ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్, డోన్ వైష్ణవి జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్, మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర డిగ్రీ కాలేజ్, ఎమ్మిగనూరు ఎస్టీ జాన్స్ ఇంజనీరింగ్ కాలేజ్, పాణ్యం కెవి సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ దుపాడు, ఆలూరు శ్రీ రాఘవేంద్ర డిగ్రీ కాలేజ్, శ్రీశైలం శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కాలేజ్ ఆత్మకూరు, నందికొట్కూరు శ్రీ సాయి రామ్ డిగ్రీ కాలేజ్, బనగానపల్లి ఎస్వి డిగ్రీ కాలేజ్, కోడుమూరు ఎంపీడీవో ఆఫీస్లో జగనన్న విద్యాదీవెన పథకాన్ని లాంఛనంగా ప్రారంభం ఉంటుందని ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజా ప్రతినిధులు హాజరవుతారని జిల్లా కలెక్టర్ తెలిపారు.

About Author