ఏపీలో జగనన్న స్వచ్ఛసంకల్పానికి శ్రీకారం!
1 min readపల్లెవెలుగువెబ్, అమరావతి: ఏపీలో సీఎంజగన్ శనివారం గాంధీజయంతిని పురస్కరించుకుని స్వచ్ఛసంక్పలానికి లాంఛనంగా శ్రీకారం చుట్టారు. ఈమేరకు విజయవాడ నగరంలోని బెంజిసర్కిల్ నందు ఏర్పటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో సీఎం జగన్ క్లీన్ ఆంధ్రపదేశ్(క్లాప్) స్కీం కింద 4,097 చెత్తతరలింపు వాహనాలను జెండా ఊపీ ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా వందరోజులపాటు కొనసాగే స్వచ్ఛసంకల్ప కార్యక్రమంలో భాగంగా ఇళ్లలోని చెత్తసేకరణకు సదరు ట్రక్‌లను వినియోగిస్తారు. గృహాల్లో తడి, పొడి, ప్రమాదకర చెత్తను వేర్వేరుగా సేకరించేలా మూడు రకాల డస్ట్బ్యూన్లను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో మొత్తం 40లక్షల గృహాలకు 1.20కోట్ల డస్ట్బ్యూన్లు పంపిణీ చేస్తారు. తద్వారా సేకరించిన చెత్తను టిప్పర్లు, ఎలక్ట్రిక్ వాహనల ద్వారా గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్లకు తరలిస్తారు. మున్సిపాలిటీ పరిధుల్లో ఇంటిగ్రేట్ సాలీడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టులను ప్రభుత్వం ప్రయివేటు ఏజెన్సీల ద్వారా నిర్వహించనుంది.