అచ్చెన్నాయుడు పై జగన్ ఆగ్రహం .. ఎందుకంటే ?
1 min read
పల్లెవెలుగువెబ్ : బీఏసీ భేటీలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడిపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడం సరికాదన్నారు. గవర్నర్ ఏ ఒక్క పార్టీకి చెందినవారు కాదని తెలిపారు. వయసును కూడా గౌరవించకుండా అవమానించారన్నారు. గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని బీఏసీ సమావేశంలో సీఎం జగన్ అన్నారు. ఈరోజు ఉదయం ఏసీ అసెంబ్లీలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగాన్ని టీడీపీ సభ్యులు అడ్డుకున్న విషయం తెలిసిందే. గవర్నర్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు.