NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జ‌గ‌న్ ప్రభుత్వం 6 ల‌క్షల కోట్ల అప్పు చేసింది !

1 min read

పల్లెవెలుగు వెబ్: వైఎస్ జ‌గ‌న్ ప్రభుత్వం పై మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రిలో విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడారు. ఏపీ ఆర్థిక ప‌రిస్థితి అస్తవ్యస్తంగా ఉంద‌ని అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఇష్టానుసారంగా అప్పులు చేసింద‌ని ఆరోపించారు. ఇప్పటి వ‌ర‌కు జ‌గ‌న్ ప్రభుత్వం 6 ల‌క్షల కోట్ల అప్పు చేసింద‌ని.. అమ‌రావ‌తిని కూడ తాక‌ట్టు పెట్టి అప్పులు తెచ్చింద‌న్నారు. ప‌రిస్థితి ఇలాగే కొన‌సాగితే ఏపీకి గ‌డ్డు ప‌రిస్థితి త‌ప్పద‌న్నారు. ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేసే రాష్ట్రాంగా ఏపీ మారిపోయింద‌న్నారు. ఇంత మంది స‌ల‌హాదారులు ఉన్నా ఏపీ ప‌రిస్థితి ద‌య‌నీయంగా ఉంద‌న్నారు. స‌ల‌హాదారులంతా ఏం చేస్తున్నార‌ని ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించారు.

About Author