కూరగాయల మార్కెట్లో జగనన్న బియ్యం వాహనాలు ..నిద్ర మత్తులో అధికారులు
1 min readపల్లెవెలుగు అన్నమయ్య జిల్లా రాయచోటి: రాష్ట్ర ప్రభుత్వంప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటివద్దకే సన్న బియ్యం పంపిణీ కార్యక్రమానికి ఉపయోగించాల్సిన వాహనాలు కూరగాయల మార్కెట్లో దర్శనమిస్తున్నా సంబంధిత అధికారులు నిద్ర మత్తులో ఉన్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. అన్నమయ్య జిల్లా పరిధిలోని పలు మండలాల్లో అస్తవ్యస్తంగా బియ్యం పంపిణీ చేస్తున్నా అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు వాహనదారులు ఏకంగా ఒక్కొక్క బియ్యం కార్డుకు ఒక కేజీ నుంచి రెండు కేజీల బియ్యం తక్కువఇచ్చి లబ్ధిదారుల పొట్ట కొడుతున్న స్థానిక అధికారులు పర్యవేక్షణ చేసిన దాఖలాలు లేవని సమాచారం. ఇలా ఎందుకని లబ్ధిదారులు ప్రశ్నిస్తే మాకు బియ్యం తరుగు వస్తున్నాయని బుకాయిస్తున్నారు.వాహనదారులు ప్రజల బియ్యం దోచుకొంటు బయట అధిక ధరలకు అమ్ముకొని వాటాలు పంచుకొంటున్నారని ప్రజలు గుసగుసలాడుకొంటున్నారు.ఏది ఏమైనా ప్రభుత్వ ఆశయాలను నీరుగారుస్తున్న వాహనధారులపైకఠిన చర్యలు తీసుకొని లబ్ధిదారులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. అదేవిధంగా జగనన్న బియ్యం బండ్లను బియ్యం పంపిణీ చేసేందుకు మాత్రమే ఉపయోగించే విధంగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని వై సి పి కార్యకర్తలు లోకేష్ తదితరులు డిమాండ్ చేస్తున్నారు.ప్రభుత్వ బియ్యం బండ్లలో కూరగాయలు ఏసుకొని మార్కెట్లో తిరగడం అన్యాయమని ఎందుకిట్లా తిరుగుతున్నారని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు వేడుక లోకేష్ మరియు మనోజ్ వెంకటేష్ తదితరులు తెలిపారు. ఉన్నతాధికారులు పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు.