ప్రజా సంక్షేమమే జగనన్న లక్ష్యం
1 min readవైసిపి రాష్ట్రకార్యవర్గసభ్యులు మలిశెట్టివెంకటరమణ
పల్లెవెలుగు వెబ్, చిట్వేల్: ప్రజాసంక్షేమం,అ భివృద్ధి రెండు కళ్ళుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండు సంవత్సరాల సూపరిపాలనసాగించారని వైసిపి రాష్ట్ర కార్యవర్గసభ్యులు మలిశెట్టి వెంకటరమణ పేర్కొన్నారు. మంగళవారం ఆయన చిట్వేలిలో విలేకరులతో మాట్లాడుతూ రాష్టంలో సంక్షేమ పధకాలతో నూతన వరవడికి శ్రీకారం చుట్టారన్నారు. రెండేళ్ల పాలనలో సంక్షేమ పథకాల ద్వార రూ . 1.25లక్షల కోట్ల నిధులు నేరుగా ప్రజల ఖాతాల్లో జమాయ్యాయన్నారు. రెండేళ్లపాలనలోనే 96 శాతం హామీలను నెరవేర్చిన ఘనత జగనన్నకే సాధ్యమైందన్నారు. ప్రభుత్వ పాలనను ప్రజలకు చేరువచేయడంలోను, సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడంలోను గ్రామసచివాలయవ్యవస్థ ప్రధానపాత్ర వహించిందన్నారు. ఆరోగ్యశ్రీని పటిష్టంగా అమలుపరుస్తూ ప్రతిపెదవాడికి కార్పొరేట్ వైద్యం అందిస్తున్నారన్నారు. రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజలు ఆర్ధిక స్వాలంబన సాధించేవిధంగా సుపరిపాలన సాగిస్తూ జగనన్న ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం సాధించారని వెంకటరమణ అన్నారు.