పవన్ వ్యాఖ్యల పై జగన్ కౌంటర్
1 min readపల్లెవెలుగువెబ్ : పవన్ కళ్యాణ్ చెప్పు చూపిస్తూ చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు సీఎం జగన్ మోహన్ రెడ్డి .. ఇటీవల ఓ నాయుకుడు బహిరంగంగా తిట్లు తిట్టినది అందరూ చూశారని.. ఇలాంటి నేతలు మనదగ్గర ఉండడం సిగ్గు చేటుగా ఉందన్నారు. దత్తపుత్రుడు. దత్తపుత్రుడి తండ్రి కలిపి మళ్లీ కుట్రలు చేసేందుకు సిద్ధమయ్యారని.. ఆ కుట్రలు.. కుతంత్రాలు తిప్పి కొట్టేందుకు అందరూ సిద్ధంగా ఉండాలని పిలుపు ఇచ్చారు. మరో 19 నెలల్లో ఎన్నికలు వస్తాయని.. ఒక్క జగన్ ను కొట్టడానికి వీరంతా ఏకమై వస్తున్నారంటే ఆశ్చర్యం వేస్తోంది అన్నారు. మనం మూడు రాజధానులు కావాలి అంటే.. వారు.. మూడు పెళ్లిళ్లు చేసుకోండి.. భార్యను వదిలేయండి అని చెబుతారా.? ఇలాంటి రాజకీయ నాయకులా మనకు దిశా నిర్ధేశం చేసేది అంటూ మండిపడ్డారు.