PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విద్యార్థులకు జగన్ తీరని ద్రోహం 

1 min read

– తెలుగునాడు విద్యార్థి సమాఖ్య ఆరోపణ 

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: రాష్ట్రంలో విద్యా వ్యతిరేక విధానాలకు తావిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యార్థులకు తీరని ద్రోహం చేస్తున్నారని పత్తికొండ నియోజకవర్గo తెలుగునాడు విద్యార్థి సమాఖ్య టి ఎన్ ఎస్ ఎఫ్. అధ్యక్షులు చక్కరాళ్ల ముని నాయుడు ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి అవలంబిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ శుక్రవారం టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి విద్యార్థిని విద్యార్థులతో స్థానిక నాలుగు స్తంభాలు దగ్గర రాస్తారోకో నిర్వహించారు. ఫీజు ఎక్కడ కంస మామ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసన కార్యక్రమంలో టి ఎన్ ఎస్ ఎఫ్ కర్నూలు జిల్లా అధ్యక్షులు శ్రీ రామాంజినేయులు పత్తికొండ నియోజకవర్గ అధ్యక్షులు శ్రీ చక్కరాళ్ల  ముని నాయుడు రాష్ట్ర కార్యదర్శి శ్రీ వడ్డే పెద్దయ్య  మాట్లాడుతూ, రాష్ట్రం లో విద్యార్థులకు విద్య దూరం చేసే దుర్మార్గమైన చర్య తీసుకుందని దుయ్య బట్టారు. అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెనల పేరిట లక్షలాది మంది విద్యార్థుల కు ఎగనామం పెట్టారని అన్నారు. 15వేల రూపాయలు ఇస్తానని మాయ మాటలు చెప్పి కేవలం 13వేల రూపాయలే ఇస్తూ, టాయ్లెట్ మైంటైనన్స్ ఫండ్ అంటూ స్కూల్ మైంటినన్స్ ఫండ్ అంటూ విద్యార్థులకు పంగ నామాలు పెడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు తక్షణమే తక్షణమే చెల్లించాలని, దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థికి విద్యాధివెన, వసతి దీవెన ఎలాంటి నిబంధనలు లేకుండా వర్తింపజేయాలన్నారు.  గత ప్రభుత్వంలో దేశంలో విద్య 3వ స్థానంలో ఉంటే నేడు YS జగన్ రెడ్డి ప్రభుత్వంలో 17వ స్థానికి దిగజారింది అని, దేశంలోనే రాష్ట్రంలో నేడు డ్రాపౌట్ విద్యార్థుల సంఖ్య అధికంగా ఉందని పేర్కొన్నారు. పెండింగులో ఉన్న పాఠ్య పుస్తకాలను తక్షణమే విడుదల చెయ్యాలని కోరారు. లేని పక్షంలో రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఉన్న విద్యార్థి సంఘాల అనింటిన్ని ఏకం చేసి ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో టి ఎన్ ఎస్ ఎఫ్ నాయకులుBT. పవన్ కుమార్, GD.మధు,పందికోన సోమన్న,భాస్కర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

About Author