జగ్జీవన్ రామ్ మున్సిపల్ ఓపెన్ థియేటర్ కూల్చివేతను ఆపివేయాలి: సిపిఎం
1 min readపల్లెవెలుగు వెబ్: మున్సిపల్ పాలక మండలి అధికారుల అనాలోచిత నిర్ణయం వల్ల కర్నూల్లో ఎంతో పేరు ప్రఖ్యాతి గాంచిన సాంస్కృతిక ఆడిటోరియం అయినటువంటి బాబు జగజ్జివన్ రామ్ మున్సిపల్ ఓపెన్ థియేటర్ కూల్చివేయడాన్ని ,సిపిఎం పార్టీ గా తీవ్రంగా ఖండిస్తున్నామని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ వివరించారు .తక్షణమే ఓపెన్ థియేటర్ ను ఆధునిక రించాలని, మౌలిక వసతులు కల్పించాలని ,ఆయన డిమాండ్ చేశారు .కర్నూలు నగరంలోని పాత బస్టాండ్ సర్కిల్ లో గల ఓపెన్ థియేటర్ కూల్చి వేత కార్యక్రమాన్ని తక్షణమే ఆపివేయాలని, సిపిఎం పార్టీ నగర కార్యదర్శి, ఎం రాజశేఖర్ అధ్యక్షతన ధర్నా కార్యక్రమం జరిగింది .ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నూలు నగర మేయర్, ఎమ్మెల్యే, పాలకమండలి, మున్సిపల్ అధికారులు ఓపెన్థియేటర్ కూల్చి చేస్తుంటే కళ్ళు అప్పగించి చూస్తున్నారా ? లేక గుడ్డి గుర్రం పళ్ళు తోముతున్న రా అని ఘాటుగా విమర్శించారు. ఎమ్మెల్యే, మేయర్, రోజు ఇటువైపే తిరుగుతూ చూస్తున్నారే తప్ప ఏ మాత్రం దాన్ని ఆపడం లేదని విమర్శించారు. నగర పాలక సంస్థ అధికారులు అనాలోచిత నిర్ణయాల వల్లే ప్రజాధనం వృధా అవుతుందని, ఈ సాంస్కృతిక కళా ఆడిటోరియం కూల్చ వలసిన అవసరం లేదని కర్నూలు నగరంలో ఉన్నటువంటి కల్చరల్ ప్రోగ్రాం నెర్చుకోవడానికి పేరుగాంచిన ఈ ఓపెన్థియేటర్ కూల్చి వేయడం భావ్యం కాదని ఆయన ఘాటుగా విమర్శించారు. తక్షణమే కూల్చడం ఆపివేయాలని లేకపోతే సిపిఎం పార్టీ గా ప్రజలను సమీకరించి, కవులను ,కళాకారులను, సాంస్కృతిక కళా రూపాలను అభిమానించే వారందరూనూ, సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో లో సిపిఎం పార్టీ జిల్లా నాయకులు ఎస్ఏ సుభాన్, నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం విజయ్, మొహమ్మద్ షరీఫ్, అబ్దుల్ దేశాయ్, రామకృష్ణ, పార్వతయ్య, ఖాజా పాష, మా భాష, గౌస్ బాష, ఇంతియాస్, నాగారాజు, కుమార్, కవులు, కళాకారులు ,కళాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.