జగన్.. నా వెంట్రుక కూడ పీకలేవు !
1 min read
పల్లెవెలుగువెబ్ : సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘జగన్మోహన్ రెడ్డి నా వెంట్రుక కూడా పీకలేడు’’ అని అన్నారు. ఎన్నో కోట్ల కుంభకోణాలకు పాల్పడ్డానని తనపై అసత్య ఆరోపణలు చేసి .. ఏమీ పీకలేక కోవిడ్ నిబంధనల ఉల్లంఘనల కేసులో కోర్టుకు తీసుకొచ్చారని మండిపడ్డారు. ఇప్పటి వరకు తనపై 14 కేసులు పెట్టి ఏం పీకారని ప్రశ్నించారు. కావాలంటే మరో 10 కేసులు పెట్టుకోవాలని సలహా ఇచ్చారు.