విజయ్ మాల్యాకు జైలు శిక్ష !
1 min readపల్లెవెలుగువెబ్ : ప‌్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు కోర్టు ధిక్కరణ కేసులో నాలుగు నెలల జైలు శిక్ష వేస్తూ సోమవారం సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. రూ.2000 జరిమానా కూడా విధిస్తూ జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ ఎస్.ఆర్.భట్, జస్టిస్ పి.ఎ్‌స.నరసింహల ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. కోర్టు ఆదేశాలు అమలు చేయనందుకు ఎలాంటి పశ్చాత్తాపం ఆయనలో కనిపించలేదని, ఎన్నో అవకాశాలు ఇచ్చినా క్షమాపణ చెప్పలేదని అభిప్రాయపడింది. కోర్టు గౌరవాన్ని కాపాడడానికి శిక్ష విధించాల్సి ఉందని తెలిపింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి ఆయన తన పిల్లలకు 40 మిలియన్ డాలర్లు (సుమారు రూ.310 కోట్లు) పంపించినట్టు అభియోగం నమోదయింది. ఇలా పంపించిన సొమ్మును 8 శాతం వార్షిక వడ్డీతో సంబంధిత రికవరీ ఆఫీసర్ వద్ద నాలుగు వారాల్లోగా తిరిగి డిపాజిట్ చేయాలని ఆదేశించింది. ఒక వేళ డిపాజిట్ చేయకపోతే సంబంధిత అధికారి తగిన చర్యలు తీసుకోవచ్చని తెలిపింది. ప్రస్తుతం విజయమాల్య పరారీలో ఉన్నారు.