కమ్యూనిటీ కాంట్రాక్టింగ్ పద్ధతి ద్వారా జల్ జీవన్ మిషన్ పనుల నిర్వహణ
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల: (గడివేముల) మండల పరిషత్ కార్యాలయంలో జల్ జీవన్ మిషన్ పనుల నిర్వహణలో కమ్యూనిటీ కాంట్రాక్టింగ్ పద్ధతి పైన అవగాహన సదస్సును ఈ ఓ ఆర్ డి అబ్దుల్ ఖలిక్ అధ్యక్షతన మంగళవారం నాడు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జల్ జీవన్ మిషన్ జిల్లా ప్రాజెక్టు పర్యవేక్షణ విభాగం జిల్లా సమన్వయ కర్త వి భీమశంకర్ రెడ్డి మాట్లాడుతూ జల్ జీవన్ మిషన్ పనుల నిర్వహణకు గ్రామస్థాయిలో గ్రామ జల సంఘాలను ఏర్పాటు చేసి కమ్యూనిటీ కాంట్రాక్టింగ్ పద్ధతి ద్వారా పనులను నిర్వహించి ప్రతి ఇంటికి తాగునీటి కుళాయిలను ఏర్పాటు చేసి స్వచ్ఛమైన నీరును అందించడం కొరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడమైనదనీ. ఈ పద్ధతి ద్వారా పనులను అమలు చేయడంలో గ్రామీణ నీరు మరియు పరిశుద్ధ శాఖ విభాగం నోడల్ ఏజెన్సీగా ఉండి పనులను పర్యవేక్షణ చేయడం మరియు పూర్తి చేయడం జరుగుతుందన్నారు. గ్రామీణ జల సంఘం ఏర్పాటు లో భాగంగా 9 మంది గ్రూప్ డ్వాక్రా మహిళలు సభ్యులుగాను స్థానిక ఇంజనీరింగ్ అసిస్టెంట్ మెంబర్ కన్వీనర్ గాను మరియు పంచాయతీ సెక్రెటరీ ఎక్స్ అఫిషియో కమిటీని ఏర్పాటు చేసుకుని జె.జె.యం పనులను నిర్వహించడం జరుగుతుంది తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ఏ ఈ పవన్ కుమార్. పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.