‘ జెమ్ కేర్ కామినేని’ లో భుజం మార్పిడి సక్సెస్…
1 min read
- ఆర్థో పెడిక్ వైద్యులు డా. రవి బాబు
- కీళ్లు, ఎముకల వ్యాధులకు అత్యుత్తమ వైద్యం అందిస్తామని వెల్లడి
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు నగరంలోని జమ్ కేర్ కామినేని హాస్పిటల్లో క్లిష్టమైన భుజం మార్పిడి ఆపరేషన్ విజయవంతంగా చేశామని ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ రవిబాబు తెలిపారు. నంద్యాల జిల్లా గాజులపల్లికి చెందిన జయమ్మ అనే పేషెంట్ కు గత సంవత్సరం జెమ్ కేర్ కామినేని హాస్పిటల్ లో మోకాలు మార్పిడి చేశామని, ఆమెకు 6 నెలల నుండి కీళ్ల నొప్పులు అధికమై చెయ్యి కూడా పైకి ఎత్తలేని పరిస్థితుల్లో హాస్పిటల్ లో చేరిందని. ఆమెకు ఎమ్మారై, ఎక్స్ రే అన్ని రకాల టెస్టులు చేసిన అనంతరం కుడి భుజం ఎముకలు పూర్తిగా అరిగి పోయినట్లు నిర్దారణ జరిగిందన్నారు. ఈ వ్యాధిని ఆంకలోసిస్ అంటారని, దీనికి ఉత్తమ చికిత్స భుజం మార్పిడి చేయడమేనని, భుజం మార్పిడి ఆపరేషన్ చాలా క్లిష్టమైనదన్నారు. ఈ ఆపరేషన్ ప్రముఖ నగరాలైన హైదరాబాదు, బెంగళూరు తదితర ప్రాంతాల్లో మాత్రమే చేస్తున్నారని. ఈ ఆపరేషన్ ఇప్పుడు కర్నూలు నగరంలో జమ్ కేర్ కామినేని హాస్పిటల్ లో చేశామని డాక్టర్ రవిబాబు తెలిపారు. భుజం మార్పిడిలో కాంప్లెక్స్ ప్రొసీజర్ రివర్స్ షోల్డర్ ఆర్థోప్లాస్టి చేశారు. దీనివల్ల రోగికి భుజం కదలిక పూర్తిగా వచ్చింది. ప్రస్తుతం పేషంటు ఫిజియోథెరపీ చికిత్సతో కోలుకుంటున్నదని డాక్టర్ రవి బాబు తెలిపారు. ఈ ఆపరేషన్ లో మత్తు డాక్టర్లు ఆదిత్య, మాధవి తదితర బృందం పాల్గొన్నారు. ఎటువంటి కీళ్లు, ఎముకలు వ్యాధులకైనా జెమ్ కేర్ హాస్పిటల్ లో అత్యుత్తమ చికిత్సలు, ఆపరేషన్ లు చేస్తామన్నారు. జమ్ కేర్ కామినేని హాస్పిటల్ లో క్లిష్టమైన భుజం మార్పిడి ఆపరేషన్ విజయవంతం చేసినందుకు డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ బాలమురళీకృష్ణ, డాక్టర్ రామమోహన్ రెడ్డి, డాక్టర్ రాఘవేంద్ర, డాక్టర్ ఆదిత్య, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్ గణేష్, నదీమ్, కృష్ణవేణి, ఆపరేషన్ చేసిన డాక్టర్ రవిబాబుకు, సిబ్బందికి అభినందనలు తెలిపారు.డాక్టర్ రవిబాబు గురించి క్లుప్తంగా చెప్పాలంటే డాక్టర్ రవిబాబు ఎంబీబీఎస్, ఎంఎస్ కర్నూలు నగరంలోని మెడికల్ కాలేజీలో చదివారు. ఫెలో షిప్, స్పోర్ట్స్ ఇంజురీస్, ఆర్తో ప్లాస్టి బెంగళూరు కేరళలో పూర్తి చేశారు. అబ్జర్వర్షిప్ జర్మనీ, సింగపూర్ లో చేశారు. ఇప్పుడు కర్నూలు నగరంలోని జెమ్ కేర్ కామినేని హాస్పిటల్లో అత్యుత్తమ సేవలందిస్తున్నారు.