PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అమరవీరులకు నివాళి అర్పిస్తున్న జమీల్‌ అహ్మద్‌ బేగ్‌

1 min read

– ఊరికొయ్యల ముద్దాడిన ముగ్గురు విప్లవ వీరులకు జోహార్లు
– జమీల్‌ అహ్మద్‌ బేగ్‌, నేషనల్‌ వైస్‌ చైర్మన్‌, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ మైనార్టీ విభాగం
పల్లవెలుగు వెబ్ గుంటూరు : గుంటూరులో బారాఇమామ్‌ పంజా సెంటర్‌లోని హుదా డిజిటిల్‌ జానీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వీరమరణం పొందిన భగత్‌ సింగ్‌, రాజ్‌ గురు, సుకుదేవ్‌లకు గురువారం నివాళి అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ మైనార్టీ విభాగం నేషనల్‌ వైస్‌ చైర్మన్‌ జమీల్‌ అహ్మద్‌ బేగ్‌ హాజరై అమరవీరులకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జమీల్‌ అహ్మద్‌ బేగ్‌ మాట్లాడుతూ బ్రిటీష్‌ వాళ్ళ చేతిలో నలిగిపోతూ భారతీయులను బానిసలుగా చేసుకున్న తెల్లదొరల బానిస సంకెళ్లనుండి విముక్తి చేయడానికి తమప్రాణాలను అర్పించిన భగత్‌ సింగ్‌, రాజ్‌ గురు, సుకుదేవ్‌లు వారి వీరమరణానికి జోహార్‌. భగత్‌ సింగ్‌ తను 13 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు గాంధీజీ సహాయ నిరాకారణోద్యమం జరిగింది. ఆ ఉద్యమం అతనిపై ఎంతో ప్రభావాన్ని చూపింది. అలా స్వాతంత్య్ర పోరాటంలో పాలుపంచుకున్నారు. అంతేకాక అతని స్నేహితులు అయిన సుకుదేవ్‌,రాజ్‌ గురు కూడా ఉన్నారు. బ్రిటీష్‌ వారికి వ్యతిరేకంగా పోరాడిన అతి చిన్న 23 సంవత్సరాల వయసులో దేశంకోసం ప్రాణత్యాగం చేసిన రోజు (మార్చి 23 1931) ఆనాటి సాయంత్రం 7:30 నిమిషాలకు భగత్‌ సింగ్‌,రాజ్‌ గురూ, సుకుదేవ్‌ లను బ్రిటీష్‌ ప్రభుత్వం ఉరితీసింది. కానీ కాసేపట్లో ఉరితీయబోతున్న భగత్‌ సింగ్‌ ముఖంలో కాసింతాకూడా భయం అనేదెలేదు. మొక్కవోని దైర్యంతో ముగ్గురు ఉరికొయ్యల కెదురుగా దేశంకోసం ప్రాణత్యాగం చేయాడానికి మేము సిద్దంగా ఉన్నాము అని దేశంకోసం నన్ను ముందు ఉరితీయండి అంటే నన్ను ముందు ఉరితీయాలని పోటీపడి ప్రాణ త్యాగం చేసిన అమరులు ఆ ముగ్గురు అని, ‘‘ఆ ముగ్గురు విప్లవ వీరులకు జోహార్లు’’ అర్పిద్దాం అని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ మైనార్టీ విభాగం, నేషనల్‌ వైస్‌ చైర్మన్‌ జమీల్‌ అహ్మద్‌ బేగ్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్‌ అహద్‌, అయూబ్‌ ఖాన్‌, సయ్యద్‌ ఫాతిమా, జానీ తదితరులు పాల్గొన్నారు.

About Author