28న అఖిల భారత వాల్మీకి జన జాగృతి సమ్మేళనం
1 min readపల్లెవెలుగు వెబ్, కర్నూలు: భారత దేశంలో ని ప్రధాన వాల్మీకి పీఠాధిపతుల ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీన అనంతపురం లో జరగబోయే అఖిల భారత వాల్మీకి జన జాగృతి సమ్మేళనం సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు పెనుగొండ ఈశ్వరయ్య, పొగాకు రామచంద్రుడు, కర్నూలు వాల్మీకి నాయకులు సత్రం రామకృష్ణుడు. ఆదివారం కర్నూలు నగరంలోని కృష్ణకాంత్ ప్లాజాలో ని వాల్మీకి బోయ సేవా సంస్థ కార్యాలయం లో అఖిల భారత వాల్మీకి జన జాగృతి సమ్మేళనం సభ వాల్పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లడుతూ సభకు భారీ సంఖ్యలో వాల్మీకి నాయకులు, కుల బంధువులు పాల్గొనాలని కోరారు.