డిప్యూటీ సీఎం ను కలిసిన జనసేన ఇన్చార్జ్ లక్ష్మన్న
1 min read
మంత్రాలయం, న్యూస్ నేడు : ఉమ్మడి కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం ఓర్వకల్లు మండలం పూసలపూడి గ్రామానికి వచ్చిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ మంత్రాలయం జనసేన ఇన్చార్జ్ బి లక్ష్మన్న మర్యాద పూర్వకంగా కలిశారు. మంత్రాలయం నియోజకవర్గ సమస్యలు, రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర ఐక్య వాల్మీకి బోయ పోరాట కమిటీ లపై కొన్ని విషయాల గురించి, జనసేన పార్టీ బలోపేతం గురించి తమరితో చర్చించాలని అడగ్గా ఆయన సానుకూలంగా స్పందించడం జరిగిందని తెలిపారు. అలాగే వాల్మీకి బోయల ఎస్టీ బిల్ గురించి కూలన్ కుశంగా చర్చించి మాట్లాడాలని కోరడం జరిగిందని తెలిపారు. దీనిపై తొందర్లో కలిసి మాట్లాడదామని శ్రీ కె పవన్ కళ్యాణ్ తెలిపినట్లు ఆయన తెలిపారు.