PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

1 min read

– భారీ సంఖ్యలో పాల్గొన్న జనసైనికులు, వీర మహిళలు
– సార్వత్రిక ఎన్నికలకు జనసైనికులు సిద్ధం కావాలి
– నియోజకవర్గ ఇన్చార్జి ..రెడ్డి అప్పలనాయుడు పిలుపు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : రానున్న సార్వత్రిక ఎన్నికలకు జనసైనికులు సంసిద్ధం కావాలి జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు పిలుపునిచ్చారు.జనసేన జనసేన పార్టీ 10 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం స్థానిక పవర్ పేట లోని జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ కార్యాలయంలో రెడ్డి అప్పల నాయుడు ఆధ్వర్యంలో జనసేన జెండా వందనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తొలుత జనసేన వీర మహిళలు కేక్ కట్ చేసి ఆవిర్భావ సభ వేడుకలకు తమ సంఘీభావాన్ని ప్రకటించారు. అనంతరం రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో అణగారిన వర్గాలకు అధికారం వైపుగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న పోరాటంలో జనసైనికులు తమ వంతు మద్దతుగా నిలవడానికి ఒక్కొక్కరు తమ తమ ఏరియాలో వందమంది కుటుంబాలను ప్రభావితం చేయాలన్నారు. జనసేన పార్టీ సభ్యుల భద్రత కొరకు పవన్ కళ్యాణ్ తన సొంత ఖర్చులతో కోటి రూపాయల మ్యాచింగ్ ఫండ్ అందించారన్నారు. క్రియాశీలక సభ్యత్వం యొక్క విశిష్టతను ప్రతి ఒక్కరికి తెలియజేయాలన్నారు. స్థానిక సమస్యల మీద, అధికార పార్టీ అవినీతి పాలన వివరాలు తెలుసుకుంటూ వచ్చే ఎన్నికల్లో యుద్ధానికి సిద్ధంగా ఉండాలన్నారు. మచిలీపట్నం లో పవన్ కళ్యాణ్ ఉపన్యాసం కోసం ఉత్సాహంగా లక్షలాదిమంది ఎదురు చూస్తున్నరన్నారు, ఈకార్యక్రమంలో ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, మాజీ డిప్యూటీ మేయర్ సిరి పల్లి ప్రసాద్, సీనియర్ నేత రాఘవయ్య చౌదరి, జనసేన పార్టీ నాయకులు ఏలూరు నగర అధ్యక్షుడు రెడ్డి నగేష్, ధర్మేంద్ర,, బొంద రామానాయుడు, సర్ది రాజేష్,, వీర మహిళలు, నగర ప్రధాన కార్యదర్శి కావూరి వాణి, డివిజన్ కార్యదర్శులు కోలా శివ, కోలా సుజాత, జనసేన కార్యకర్తలు, వీర మహిళలు, జనసైనికులు, మెగా అభిమానులు తదితరులు పాల్గున్నారు..
ఛలో మచిలీపట్నం : జనసేన పార్టీ 10 వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని మచిలీపట్నం లో పవన్ కళ్యాణ్ ఉపన్యాస కార్యక్రమంలో పాలుపంచుకునేందుకు జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు ఆధ్వర్యంలో స్థానిక పాండురంగ థియేటర్ వద్ద నుండి సుమారు 100 కార్లతో భారీ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ ర్యాలీ ఏలూరు నగరంలోని మెయిన్ బజార్, గడియార స్తంభం, పెద్ద పోస్ట్ ఆఫీస్, పెరుగు చెట్టు, గాంధీ మైదానం, జ్యూట్ మిల్లు, వసంత మహల్, పాత బస్ స్టాండ్, ఆదివారపు పేట, నూకాలమ్మ గుడి, ఏకే జి సెంటర్, పవర్ పేట స్టేషన్ రోడ్డు, ఆర్.ఆర్. పేట, ఫైర్ స్టేషన్, సత్రంపాడు, వట్లూరు మీదుగా పర్యటించి మచిలీపట్నం పయనమయ్యారు.

About Author