రక్తదానం చేసిన..జనసేన యువకుడు…
1 min read
నేనున్నానంటూ ముందుకెళ్తున్న ప్రభాకర్..
మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్ నేడు : ప్రజలకు ఏ సమస్య వచ్చినా నీకు అండగా నేనున్నానంటూ జనసేన పార్టీ యువకుడు ప్రభాకర్ ప్రజలకు భరోసానిస్తున్నాడు.వివరాల్లోకి వెళ్తే ఎమ్మిగనూరు మండలం మల్కాపురం గ్రామానికి చెందిన జి హుస్సేనమ్మ అనే మహిళ అనారోగ్యంతో కనులు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉంది.కానీ ఆమెకు ఆపరేషన్ పడుతుందని డాక్టర్లు చెప్పారు.ఆపరేషన్ కు సిద్ధపడుతున్న తరుణంలో రిపోర్టుల్లో రక్తం అతి తక్కువగా ఉండటం వల్ల ఆపరేషన్ చేయడానికి కుదరదని డాక్టర్లు పేషెంట్ కు చెప్పారు.ఈ విషయం తెలుసుకున్న నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని గుడిపాడు గ్రామానికి చెందిన సంఘన్నగారి రాముడు, రాములమ్మ కుమారుడు జనసేన పార్టీ మిడుతూరు మండల యువ నాయకుడు ఎస్ ప్రభాకర్(28) బుధవారం సాయంత్రం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి రక్తదానం చేశాడు.రక్తదానం ఇవ్వటం వల్ల కుటుంబ సభ్యులు ప్రభాకర్ కు కృతజ్ఞతలు తెలిపారు.జనసేన పార్టీ కార్యక్రమాల్లోనూ సభ్యత్వం చేయటంలోనూ ప్రభాకర్ చాలా చురుగ్గా పాల్గొంటూ ఉన్నారు.అనేక సేవా కార్యక్రమాల్లోనూ తన సొంత ఖర్చులతో ప్రజల మధ్యకు చొచ్చుకు వెళ్తున్నారు.ప్రభాకర్ ను జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి కూడా అభినందించారు.