మంత్రి పేర్నినాని కాన్వాయ్‌ని అడ్డుకున్న జనసేన కార్యకర్తలు
1 min readపల్లెవెలుగువెబ్, పశ్చిమగోదావరి: గురువారం తణుకులో పర్యటించేందుకు రాష్ట్ర మంత్రి పేర్నినాని వచ్చిన సందర్భంలో వాహన కాన్వాయ్‌ని జనసేన కార్యకర్తలు అడ్డుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు ఇంటి వద్ద మంత్రి పేర్నినాని కాన్వాయ్‌ని అడ్డగించే క్రమంలో జనసేన కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై మంత్రి క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. గత కొద్దిరోజులుగా పవన్‌కళ్యాణ్‌కు, ఏపీ మంత్రుల మధ్య పరస్పర మాటల యుద్ధం జరుగుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే పవన్‌కళ్యాణ్ వైఖరిపై రాష్ట్ర మంత్రులు అవంతి, అనిల్‌కుమార్, పేర్నినాని, నారాయణ తదితరులు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.