NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జనసేన కార్యకర్తలకు తోక ఒక్కటే తక్కువ !

1 min read

పల్లెవెలుగువెబ్ : జనసేన కార్యకర్తలు తోకలేని కోతులని మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. విజయవాడలో నిన్న విలేకరులతో మాట్లాడిన ఆయన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విశాఖ గర్జన జరిగే సమయంలో పవన్ నగరానికి రావాల్సిన అవసరం ఏముందని మంత్రి ప్రశ్నించారు. కార్యక్రమాన్ని ముందే నిర్ణయించినప్పటికీ గొడవలు జరిగే అవకాశం ఉందని తెలిసినప్పుడు వాయిదా వేసుకుని ఉండాల్సిందని అన్నారు. జనసేన కార్యకర్తలకు తోక ఒకటే తక్కువన్న ఆయన.. ఈ తోకలేని కోతులు పవన్‌నే వాహనం నుంచి కింద పడేశాయని అన్నారు. విశాఖ విమానాశ్రయం వద్ద కర్రలు, రాడ్లతో దుర్మార్గంగా దాడిచేశారని అన్నారు. వారి దాడిలో మంత్రి రోజా తలపగిలి ఉండేదని ఆవేదన వ్యక్తం చేశారు.

       

About Author