జనసేన రాజకీయ పార్టీ కాదు !
1 min read
పల్లెవెలుగువెబ్ : తనను ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతానంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా బుధవారం ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని బొత్స తెలిపారు. అసలు జనసేన ఓ రాజకీయ పార్టీ కాదన్న బొత్స…అదో సెలబ్రిటీ పార్టీ అని అన్నారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమని… అయితే పవన్ వ్యాఖ్యలు మాత్రం ఆ హద్దులను దాటేశాయన్నారు.