NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జంగారెడ్డిగూడెం పట్టణానికి  మహర్దశ..

1 min read

అభివృద్ధి, సంక్షేమం జగనన్నతోనే సాధ్యం

పలు శంకుస్థాపనలు చేసిన

చింతలపూడి వైసీపీ అభ్యర్థి కంభం విజయరాజు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఎన్నో ఏళ్లగా అధ్వానంగా ఉన్న రోడ్లను, సిసి రోడ్ల వేసేందుకు చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కంభం విజయ రాజు  కృషితో   ప్రజలకల నెరవేరింది. చింతలపూడి నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి కంభం విజయ రాజు జంగారెడ్డిగూడెం పట్టణంలో అధ్వానంగా ఉన్న పలు రోడ్లకు సిసి రోడ్లుగా వేసేందుకు శంకుస్థాపనలు చేశారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఇబ్బందులకు గురికాకుండా ఉండేందుకు నియోజకవర్గాలలో జగనన్న రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అందిస్తున్నారని అన్నారు. దానిలో భాగంగా జంగారెడ్డిగూడెం మున్సిపల్  కార్యాలయంలో శనివారం సీఎంఆర్ఎఫ్ చెక్కులను నియోజకవర్గ ఇన్చార్జ్ విజయ రాజు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పోల్నాటి బాబ్జి, జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ బత్తిన నాగలక్ష్మి , సీనియర్ వైఎస్ఆర్సిపి నాయకులు జెట్టి గురునాధరావు, మున్సిపల్ వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, గ్రంథాలయ, దేవాలయ, ఆసుపత్రి చైర్మన్లు, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

About Author