NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మలయాళ రీమేక్‌లో జాన్వీ..

1 min read

సినిమా డెస్క్​ : బాలీవుడ్‌లో మంచి ఫామ్‌లో ఉన్న హీరోయిన్లలో ఒకరు జాన్వీకపూర్‌‌. ‘ధడక్‌’ సినిమాతోనే మంచి ఫాలోయింగ్‌ తెచ్చుకున్న జాన్వీ.. క్షణం తీరిక లేకుండా వరుస చిత్రాల్లో నటిస్తోంది. ఆమె నటించిన ‘గుడ్ లక్ జెర్రీ’ షూటింగ్‌ పూర్తయి విడుదలకు సిద్ధంగా ఉంది. దోస్తానా 2, తమిళ హిట్ ‘కోలమావు కోకిలా’ రీమేక్ చిత్రాలు సెట్స్‌పై ఉన్నాయి. ఇంతలోనే మలయాళ రీమేక్‌ మూవీ షూటింగ్‌ కూడా మొదలుపెడుతున్నామంటూ అనౌన్స్‌మెంట్‌ వచ్చింది. 2019లో వచ్చిన ‘హెలెన్‌’ మూవీని హిందీలో రీమేక్‌ చేస్తున్నారు. ఇది తమిళంలో ‘అన్‌బిరికియాలన్‌’గా రీమేక్‌ అయ్యింది. మాతృకకు దర్శకత్వం వహించిన మాతుకుట్టి జేవియర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సర్వైవల్ థ్రిల్లర్‌‌గా తెరకెక్కనున్న ఈ మూవీలో జాన్వీ ప్రధాన పాత్రలో నటిస్తోంది. తన పాత్ర పేరు మిలీ.

అసలు ఈ మూవీ షూట్‌ ఈ నెల్లో ప్రారంభించాల్సి ఉంది. కానీ లాక్‌డౌన్‌ పొడిగింపు కారణంతో షెడ్యూల్‌ ఆలస్యమయింది. ఇప్పుడీ చిత్ర షూటింగ్‌ ఆగస్టులో మొదలుపెట్టడానికి సన్నాహాకాలు చేస్తోంది టీమ్‌. దీనికి టైటిల్‌ ‘మిలీ’ అని అనుకుంటున్నారట. షూటింగ్‌ విదేశాల్లో జరపాల్సి ఉన్నప్పటికీ కోవిడ్‌ కారణంగా ఇండియాలోనే సెట్స్‌ వేసి షూట్‌ చేస్తారట.

About Author