ఏపీకి ‘జవాద్’ ముప్పు
1 min readపల్లెవెలుగు వెబ్ : ఆంధ్రప్రదేశ్ జవాద్ తుఫాన్ ముప్పు పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. విశాఖపట్నానికి 960 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన వాయుగుండం మరింత బలపడి శుక్రవారం మధ్య బంగాళాఖాతంలో జవాద్ తుఫాన్ గా మారుతుందని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కన్నబాబు తెలిపారు. దీని ప్రభావంతో 2రోజుల పాటు ఉత్తరాంధ్రలో పలుచోట్ల మోస్తారు వర్షాలు, అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు.
ReplyForward |