21న డీఈఓ కార్యాలయం ముట్టడిని జయ ప్రదం చేయండి
1 min read
ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక..
కర్నూలు: రాష్ట్రములోని పాఠశాలల పునర్విజన , క్రమబద్ధీకరణ చేయుటకు ప్రభుత్వం 19,20 మరియు 21ఉత్తర్వులను విడుదల చేసిందని ఈ ఉత్తర్వులు కొత్త ప్రయోగాలుగా, అసంబద్ధంగా ఉన్నాయని ఈ అసంబద్ధాలని తొలగించాలని ప్రభుత్వానికి నోటీసులు అందజేయడం జరిగిందని ఆ మేరకు మే 21 న ఉమ్మడి జిల్లా కేంద్రంలో, 23న అమరావతిలోని విద్యా భవన్ ముట్టడి కార్యక్రమాలను ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక పక్షాన చేపడుతున్నట్లు తెలిపారు. ప్రస్తుత ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న అసంబద్ధ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈ నెల 21 ఉమ్మడి కర్నూల్ జిల్లా ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో కర్నూల్ DEO కార్యాలయం ని ముట్టడి ని ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఐక్య వేదిక నాయకులు కోరారు. స్థానిక STU భవన్ నందు జరిగిన సన్నాహక సమావేశంలో ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు GO 117 పూర్తిగా రద్దు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలో వచ్చాక బడులను విచిన్నం చేసి 9 రకాల పాఠశాలల తో ప్రభుత్వ పాఠశాలలు పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారని అన్నారు కార్యక్రమంలో అన్ని సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన హేతుబద్దీకరణ, పునర్విభజన జీవోలు 19, 20, 21 లలో అసంబద్ధ విధానాలు ప్రధానంగా తెలుగు మీడియం , మైనర్ మీడియం లను పూర్తిగా విస్మరించడం, సబ్జెక్ట్ టీచర్లను ప్రాధమిక పాఠశాలలకు పంపడం, కొత్త ఉన్నత పాఠశాలలకు హెడ్మాస్టర్ , వ్యాయమోపాద్యాయులను కేటాయించకపోవడం , ఫౌండేషన్ స్కూల్ లలో 1:30 రేషియో అమలు చేయడం , నిర్ధిష్టమైన పూర్వ ప్రాథమిక విద్యా రూపకల్పన లేకపోవడం తదితర అసంబద్ధ విధానాలతో గందరగోళంగా ఉన్నాయని, ఈ విధానాలపై అన్ని ఉపాధ్యాయ సంఘాలు మొదటి నుండి వ్యతిరేకిస్తూ వస్తున్నట్లు తెల్పారు. ఈ అసంబద్ధ విధానాలను ప్రభుత్వం తొలగించాలని రాష్ట్రంలో ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఏర్పడిందని, మే 21 న ఉమ్మడి జిల్లా కేంద్రం, మే 23న రాష్ట్రంలో ఆందోళనా కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని అన్నారు . ఈ సమావేశం లో ఆప్టా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రకాష్ రావు , అపస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ , పి అర్ టి యు రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కరుణానిధి మూర్తి భాగస్వామ్య సంఘాల నాయకులు UTF పక్షాన రవికుమార్ ,నవీన్ పాటి, STU పక్షాన గోకారి ,జనార్దన్,APTF 1938 పక్షాన ఇస్మాయిల్, మరియానందం ,APTF 257 పక్షాన రంగన్న , PRTU పక్షాన ధనుంజయ, రవి ప్రకాష్, క్రిష్ణా రెడ్డి APUS పక్షాన నాగిరెడ్డి, వెంకటేశ్వర్లు, APTA మధుసూదన్ రెడ్డి, సేవా లాల్ నాయక్,HMA హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
