భగవాన్ శ్రీ బాల సాయిబాబా జయంతి వేడుకలు
1 min readపల్లెవెలుగు వెబ్, కర్నూలు: భగవాన్ శ్రీ బాల సాయిబాబా 61 వ జన్మదిన వేడుకలు కర్నూలు లో ఆహ్లాదంగా ముగిశాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కర్నూలు శాసన సభ్యులు హఫీజ్ ఖాన్, కర్నూలు పార్లమెంట్ సభ్యులు శ్రీ సంజీవ్ కుమార్, కర్నూలు నగర మేయర్ శ్రీ బి వై రామయ్య పాల్గొన్నారు. కర్నూలు పార్లమెంట్ సభ్యులు సంజీవ్ కుమార్, కర్నూలు నగర మేయర్ బి వై రామయ్య ప్రసంగించిన అనంతరం కర్నూల్ శాసనసభ్యులు హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో పలుచోట్ల విద్యా సంస్థలు స్థాపించి ఉచిత విద్యను అందించిన శ్రీ భగవాన్ బాల సాయిబాబా ట్రస్టుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేశారు. ఆయన చనిపోయిన అనంతరం కూడా ట్రస్ట్ కొనసాగిస్తూ ఉచిత విద్య తో పాటు పలు సేవా కార్యక్రమాలు చేస్తున్న ట్రస్ట్ శ్రీ భగవాన్ బాల సాయి బాబా కొనియాడారు. మానవసేవే మాధవసేవ అంటూ ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ, పేద ప్రజలకు వ్యాపారం నిమిత్తం తోపుడు బండ్లు లాంటి సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ రామారావును ప్రశంసించారు.
ఉచిత వైద్యం..
భగవాన్ శ్రీ బాలసాయి బాబా జయంతిని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కర్నూలు నగరంలోని ఓమ్నీ, అమ్మ హాస్పిటల్ ఎండీ డా. త్రినాథ్ , డా. శశికాంత్ రెడ్డి నేతృత్వంలో వైద్యులు పేదలకు వైద్య సేవలు అందించారు. బాలసాయిబాబా జయంతి వేడుకలకు వచ్చిన పేదలకు బీపీ, షుగర్, జ్వరం, రక్తపరీక్ష తదితర చికిత్సలు చేసి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డా. త్రినాథ్, డా. శశికాంత్ రెడ్డి మాట్లాడుతూ భగవాన్ శ్రీ బాలసాయిబాబా జయంతి సందర్భంగా ఉచిత వైద్య సేవ నిర్వహించడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు.