రజక వృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి
1 min readపల్లెవెలుగు వెబ్ ఆస్పరి: ఆస్పరి మండలం కైరుప్పల గ్రామంలో బండమీది వెంకటేశ్వర్లు భవనంలో ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని వాల్ పోస్టులను విడుదల చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి రాజశేఖర్ గారు ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి రమేష్ గారు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ మన సమాజంలో పని విభజన జరిగిన నాటినుండి తరతరాలుగా రజక వృత్తిదారులు బట్టలను ఉతుకుతూ సమాజాన్ని శుభ్రం ఉంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న రజకులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. కేంద్రంలో రాష్ట్రంలో పాలకుల అధికారంలోకి రావడానికి రజక వచ్చి దారుల జీవితాల్లో మార్పును తెస్తామని అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరిస్తున్నారు. రాష్ట్రంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి 56 ఉత్తుల కుల కార్పొరేషన్ ఏర్పాటు చేసి చైర్మన్ లను డైరెక్టర్లను నియమించినప్పటికీ వాటికి నిధులు కేటాయించకుండా ఉత్సవ విగ్రహాలుగా మార్చి కాలపరిమితి ముగిసిపోయింది అని అన్నారు. వృత్తిదారుల వృత్తిని కాపాడడానికి ప్రోత్సాహాలను సబ్సిడీలను ఇవ్వాలి మరియు రజకులను ఎస్సీ జాబ్స్ లో చేర్చాలి అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి రజకులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు సామాజిక భద్రత చట్టాన్ని తీసుకుని వచ్చి రక్షణ కల్పించాలి ఇంకా తదితర సమస్యలపై చర్చించి సాధించుకునేందుకు ఈనెల 21 అనంతపూర్ లో జరిగే రజక వృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని ఈ సదస్సుకు రజక సోదర సోదరీమణులు ప్రజలు మేధావులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారన్నారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు వీరేష్ శీను సుంకన్న హుసేని తదితరులు పాల్గొన్నారు.