రాష్ట్రస్థాయి రైతు సదస్సు జయప్రదం చేయండి…
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: కరువు వలసలు ఆత్మహత్యలకు నిలయంగా మారిన కరువు పీడిత రాయలసీమ పట్ల వైసిపి,బిజెపి వైఖరిని నిరసిస్తూ రాయలసీమలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తిచేయాలని నికరజలాలను కేటాయించాలని కోరుతూ సెప్టెంబర్ 1వ తేదీన నంద్యాలలో జరిగే రాష్ట్ర స్థాయి రైతు సదస్సును జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా నాయకులు ఎం.రమేష్ బాబు పిలుపునిచ్చారు. శనివారం మండల కేంద్రంలోని మండ్లెం రైతులతో కలిసి సదస్సు కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రాన్ని రక్షించండి దేశాన్ని కాపాడండి అన్న నినాదంతో ఆగస్టు 17 నుండి ప్రారంభమైన సిపిఐ రాష్ట్ర బస్సు యాత్రలో భాగంగా రాయలసీమ నీటిపారుదల ప్రాజెక్టులపై సెప్టెంబర్ ఒకటవ తేదీన నంద్యాలలో రాష్ట్రస్థాయి సదస్సు జరుగుతున్నదని నిత్యం కరువుతో తల్లఢిల్లుతున్న రాయలసీమ ప్రాంతం లో నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందన్నారు. రాయలసీమ ప్రాజెక్టులు పూర్తి చేయకపోగా కేంద్రంలో ఉన్న బిజెపి రాయలసీమ రైతాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న ఒక్క మాట కూడా మాట్లాడకుండా వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాయలసీమ ప్రయోజనాలను తాకట్టు పెట్టాడని వారు విమర్శించారు. రాయలసీమ రైతాంగానికి సాగునీరు లేకపోవడం వల్ల రైతులు గ్రామాలు విడిచి వ్యవసాయ కూలీలుగా మారి వలసలు పోతున్నారని చేసిన అప్పులు తీర్చలేక అధిక వడ్డీ వ్యాపారుల వేధింపులు భరించలేక అవమానంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని రాయలసీమకు పశ్చిమాన తుంగభద్ర ఉత్తరాన కృష్ణమ్మ పరవలతో పారుతుంటే కళ్ళారా చూస్తూ నీటిని వినియోగించ లేని స్థితిలో ఈ ప్రాంత రైతాంగం ఉన్నారన్నారు. కర్ణాటక తెలంగాణ రాష్ట్రాలు అనుమతులు లేని అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తూ నీటిని దోచుకుంటుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చూస్తూ చూడనట్లు వ్యవహరిస్తూ శ్రీశైలం నుండి రావాల్సిన నికర జలాలు కూడా ఉపయోగించే పరిస్థితి లేదన్నారు.మిగులు జలాలు అందుతాయి అన్న గ్యారెంటీ లేని పరిస్థితుల్లో ఈ పాలకులు ఉన్నారని ఈ ప్రాంత త్రాగునీటి అవసరాలకు తగ్గట్టు ప్రాజెక్టులు లేకపోవడం, రాయలసీమ ప్రజల చిరకాల ఆకాంక్ష సిద్దేశ్వరం అలుగు గుండ్రేవుల నిర్మాణానికి నోచుకోవడం లేదని వారు విమర్శించారు. రాయలసీమను కరువు శాశ్వతంగా పోవాలంటే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని కోరుతూ నిర్వహించే ఈ సదస్సులో అధిక సంఖ్యలో రైతులు పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి సురేష్, ప్రసాదు, రైతులు, నాగన్న, నరసింహా, తదితరులు పాల్గొన్నారు.