NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

24న రాయలసీమ కర్తవ్య దీక్షను జయప్రదం చేయండి : బైరెడ్డి

1 min read

– ఇతర జిల్లాల నుంచి రాజకీయాలకతీతంగా నాయకుల హాజరు

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు : ఈనెల 24వ తేదీన ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటలవరకు కర్నూలు ఎస్టీబీసీ కళాశాల ప్రాంగణంలో జరగనున్న రాయలసీమ కర్తవ్య దీక్షను జయప్రదం చేయాలని నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు.మిడుతూరు మండల కేంద్రంలోని తువ్వా పెద్ద మల్లారెడ్డి గృహంలో ఏర్పాటుచేసిన కార్యకర్తల సమావేశంలో దీక్ష గురించి ఆయన కార్యకర్తలకు వివరించారు.ఈ దీక్షకు పార్టీలకు అతీతంగా రాయలసీమ జిల్లాల నుంచి జెసి దివాకర్ రెడ్డి,అనంతపురం శైలజనాథ్,కడప జిల్లా నుంచి మైసూరా రెడ్డి,డిఎల్ రవీంద్రా రెడ్డి,తులసి రెడ్డి అలాగే మందకృష్ణ మాదిగ,చిత్తూరు నుంచి సీకే బాబు మరియు తదితర రాజకీయ పార్టీలకు అతీతంగా నాయకులు ఈ దీక్షకు హాజరు అవుతున్నారని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తెలిపారు.అంతేకాకుండా రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఈ దీక్షకు హాజరై మీ మద్దతు తెలపాలని ఆయన కోరారు.ఈకార్యక్రమంలో తువ్వా పెద్ద మల్లారెడ్డి కుమారుడు తువ్వా అయ్యపు రెడ్డి,జూపాడుబంగ్లా మాజీ జెడ్పీటీసీ నాగేశ్వరరావు,మిడ్తూర్ మండల కన్వీనర్ నాగేశ్వరరావు,వివిధ గ్రామాలకు చెందిన బైరెడ్డి అభిమానులు పాల్గొన్నారు.

About Author