220 కెవి విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన జెసి
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల : గడివేముల మండలం కొర్రపోలుర్ గ్రామ సమీపంలోని దాదాపు 98 కోట్ల రూపాయల పైచిలుకు నిధులతో 16 ఎకరాల విస్తీర్ణంలో వ్యవసాయ, గృహలకు, పారిశ్రామిక అవసరాల కొరకు 220/132/33 కె వి కె.వి విద్యుత్ కేంద్రం నిర్మిస్తున్న ప్రాంతాన్ని శుక్రవారం నాడు నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ . టీ రాహుల్ కుమార్ రెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడుతూ సబ్ స్టేషన్ నిర్మాణం వల్ల స్థానికంగా చదువుకున్న యువతకు ఉపాధి లభిస్తుందని తెలియజేశారు నిర్మాణ ప్రాంతంలో పనులను మొదలు పెట్టాలని తాసిల్దార్ ను ఆదేశించారు జెసి వెంట తహసిల్దార్ శ్రీనివాసులు రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.