తాడిపత్రిలో జేసి జోరు..
1 min read– 1200 మెజార్టీతో విజయం
తాడిపత్రి;
మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా జోరు కొనసాగించినప్పటికి.. తాడిపత్రిలో టీడీపీ జోరు కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 19 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు గెలిచినట్టు…13 స్థానాల్లో వైసిపి గెలిచినట్టు తెలుస్తోంది. 24 వార్డు నుంచి పోటీ చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి..1200 ఓట్ల మెజార్టీ తో గెలిచారు. తాడిపత్రి మునిసిపాలిటి కైవసం దిశగా టీడీపి సాగుతోంది. చాలా ప్రాంతాల్లో క్లీన్ స్వీప్ చేసే పరిస్థితి కనిపిస్తోంది. అనంతపురం జిల్లాలో ట్రెండ్స్ ని గమనిస్తే ఇప్పటికే కొన్ని మున్సిపాల్టీల్లో ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. వీటిలో ప్రధానంగా కళ్యాణదుర్గం, రాయదుర్గం, మడకశిర, పుట్టపర్తి, గుత్తి లో వైసీపీ మున్సిపాల్టీలను కైవసం చేసుకుంది. జిల్లా వ్యాప్తంగా 169 వార్డులకు కౌంటింగ్ పూర్తవ్వగా.. వైసీపీ–140, టీడీపీ -27 , ఇండిపెండెంట్లు -2 స్థానాలు కైవసం చేసుకున్నారు. ఇంకా 168 వార్డులకు సంబంధించిన ఫలితాలు తేలాల్సి ఉంది.
మున్సిపాలిటీ- కళ్యాణ దుర్గం
మొత్తం స్థానాలు- 24
వైసీపీ-19
టీడీపీ-4
ఇతరులు-1
రాయదుర్గం- మెత్తం స్థానాలు-32
టీడీపీ-2
వైసీపీ-30
గుత్తి- మొత్తం స్థానాలు-19
వైసీపీ-18
టీడీపీ-1
పుట్టపర్తి-మొత్తం స్థానాలు-20
వైసీపీ-14
టీడీపీ-6
మడకశిర-మొత్తం స్థానాలు-20
వైసీపీ-15
టీడీపీ-5