జీ తెలుగులో.. సంక్రాంతి సంబరాలు
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: 2023 2022 ఏడాదిలో అద్భుతమైన సీరియల్స్ , సూపర్ హిట్ కార్యక్రమాలు మరియు సినిమాలతో తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది జీ తెలుగు . అంతేకాకుండా పండుగల సమయంలో ప్రత్యేక కార్యక్రమాలతో కూడా ఆకట్టుకుంది. ఈ సంక్రాంతి పండుగకు మరింత వినోదాన్ని అందించబోతోంది . ఇందులో భాగంగా జనవరి 14 వ తేదీ ఉదయం 9 గంటలకు సంక్రాంతి సంబరాలు మొదటి భాగం ప్రసారం కానుంది . టీవీ స్టార్స్లో పాటు ఎనర్జిటిక్ యాంకర్లు రవి , శ్యామల తమ అద్భుతమైన యాంకరింగ్తో అలరించారు . అంతేకాకుండా కొన్ని ఆహ్లాదకరమైన గేమ్లు మిమ్మల్ని కచ్చితంగా అలరిస్తాయి . ఆద్యంతం ఆకట్టుకునే కార్యక్రమాలు , జీ కుటుంబ సభ్యుల ఆటాపాటలు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తాయి . సంక్రాంతి సంబరాలకు ప్రత్యేక అతిథిగా హాజరైన క్యూట్ మరియు బబ్లీ మృణాల్ ఠాకూర్ అందరి హృదయాలను గెలుచుకున్నారు . ప్రేక్షకుల్లానే , ఆమె కూడా టీవీ స్టార్స్ యొక్క పర్ఫార్మెన్స్లు చూసి మైమర్చిపోయారు . వాటిలో లీనమైపోయి వీక్షించారు . సంక్రాంతి సంబరాల్లో భాగంగా టీవీ స్టార్స్ని రెండు టీమ్లుగా విభజించారు . ఈ రెండు టీమ్లకు హరిత , అన్నపూర్ణమ్మ లీడర్లుగా వ్యవహరించారు . ఈ రెండు టీమ్ల మధ్యే డ్యాన్స్ పర్ ఫార్మెన్స్లు , ఆటలు , కుండ పగులగొట్టడం , సంక్రాంతి ప్రత్యేక భోజనం వంటి కార్యక్రమాలు నిర్వహించారు . మరోవైపు మిర్చి పాటకు జీ తెలుగు మహిళా ప్రధాన పాత్రధారుల పర్ఫార్మెన్స్ ప్రతీ ఒక్కరినీ అలరిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.L ఇక రెండో భాగం … జనవరి 15 న సాయంత్రం 6 గంటలకు ప్రసారం అవుతుంది . సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ సంక్రాంతి సంబరాలు ఈ రెండో భాగంలో ఉంటాయి.ఇక ప్రేక్షకులు అస్సలు మిస్ చేయకూడని గేమ్ జిలేబీ తినే గిమ్ . ఈ గేమ్న జంటల మధ్య నిర్వహించారు . నటీనటులు తమ భాగస్వామిని ఎత్తుకోవడం , వారి చేతులు ఉపయోగించకుండా జిలేబీలను తినడం ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది . అంతా సరదా ఆటపాటలు మాత్రమే కాకుండా … యాంకర్ ప్రదీప్ పూనకాలు లోడింగ్ పాట ఎంటర్టైన్మెంట్ను మరో లెవల్కు తీసుకువెళ్తుంది . వీటితోపాటు బావ మనోభావాలు ఫేమ్ చంద్రిక రవి సూపర్బ్ డ్యాన్స్ , DJ టిల్లు ఫేమ్ నేహా శెట్టి అందించే అద్భుతమైన ఫన్ ప్రేక్షకుల్ని టీవీ స్క్రీన్ కి కూడా కట్టిపడేలా చేస్తాయి . మొత్తంగా , జీ తెలుగు సంక్రాంతి సంబరాలు ప్రేక్షకులకు సరికొత్త ఆనందాన్ని అందిస్తాయనడంలో సందేహం లేదు.