NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జేఈఈ మెయిన్స్ షెడ్యూల్ విడుద‌ల

1 min read

పల్లెవెలుగువెబ్ : దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీ, ఐఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశం కోసం నిర్వహించే జేఈఈ మెయిన్స్ 2022 పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. వచ్చే ఏప్రిల్, మే నెలల్లో రెండు దశలుగా ఈ పరీక్షలు జరగనున్నాయి. ఇంతకుముందు నాలుగుసార్లు పరీక్ష రాసే అవకాశం ఉండగా, ఈ ఏడాది దీన్ని రెండుసార్లకు మాత్రమే పరిమితం చేసింది ఎన్‌టీఏ. తాజా షెడ్యూల్ ప్రకారం మార్చి 1 నుంచి 31 వరకు జేఈఈకి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మొదటి దశ పరీక్షలు ఏప్రిల్ 16, 17, 18, 19, 20, 21 తేదీల్లో, రెండో దశ పరీక్షలు మే 24, 25, 26, 27, 28, 29 తేదీల్లో జరుగుతాయి.

                                                    

About Author