జేసీ.. మంత్రి కాళ్ల పై పడటం అవమానకరం !
1 min read
పల్లెవెలుగువెబ్ : జాయింట్ కలెక్టర్ ఒక మంత్రి కాళ్ల పై పడటం యావత్ వ్యవస్థకే అవమానకరమని టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శించారు. ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు. ఓ ఐఏఎస్ అధికారి రాజకీయ నాయకుడి కాళ్లపై పడిపోవడం యావత్ పాలనా వ్యవస్థకే అవమానకరమని అన్నారు. జిల్లా పాలనా యంత్రాంగం అంతా మంత్రి బొత్స చెప్పుచేతల్లో ఉందనడాన్నిఈ సంఘటన ప్రతిబింబించడం లేదా? అని ప్రశ్నించారు. ఇటువంటి చర్యల ద్వారా రాష్ట్ర ప్రజలకు ఏలాంటి సంకేతాలు ఇవ్వాలనుకుంటున్నారని నిలదీశారు. దీన్ని ఐఏఎస్ అధికారుల సంఘం ఖండించాల్సిన అవసరం లేదా? అని అన్నారు.