ఝాన్సీ లక్ష్మీబాయి పోరాటం.. ఆదర్శం
1 min readపల్లెవెలుగు వెబ్, కర్నూలు: స్వాతంత్రం సంగ్రామంలో పురుషులతో సమానంగా పోరాడిన వీరవనిత ఝాన్సీలక్ష్మి భాయి … ప్రతిఒక్కరికీ ఆదర్శమని పేర్కొన్నారు నిర్వహించారు నేషనల్ ఉమెన్స్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. మహబూబ్ బాష. శుక్రవారం లక్ష్మిభాయి వర్ధంతి సందర్భంగా ఎన్డబ్ల్యూపీ కార్యాలయంలో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ కర్నూల్ జిల్లా అధ్యక్షురాలు ఎస్ హసీనా బేగం మాట్లాడుతూ భారత సంస్థానాన్ని ఆక్రమించుకోవడానికి ఈస్టిండియా కంపెనీ ప్రవేశపెట్టిన దత్తత స్వీకార నిరాకరణ బిల్లుకు వ్యతిరేకంగా లక్ష్మిబాయీ విరోచితంగా పోరాడిందని గుర్తు చేశారు కార్యక్రమంలో ఎన్డబ్ల్యూపీ జిల్లా ఉమెన్స్ వింగ్ ప్రెసిడెంట్ ఎన్. మేరీ, శ్రీరామ్ నగర్ ఇంఛార్జి విజయమ్మ, పి.ఆర్. ఓ.సురేఖ ఈదన్న, కుమార్, మధు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.