జార్ఖండ్ ముఖ్యమంత్రి రాజీనామా ?
1 min readపల్లెవెలుగువెబ్ : జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ శాసనసభ్యతం రద్దుపై సస్పెన్స్ కొనసాగుతోంది. గవర్నర్ నిర్ణయానికి ముందే సోరెన్ రాజీనామా చేయబోతున్నారనే వార్తలు వినబడుతున్నాయి. ఈ క్రమంలోనే అధికార జేఎంఎం-కాంగ్రెస్ కూటమికి చెందిన నేతలు రాష్ట్ర గవర్నర్ రమేశ్ బయాస్ను గురువారం సాయంత్రం కలవటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ భేటీ అనంతరం హేమంత్ సోరెన్ రాజీనామాపై క్లారిటీ ఇచ్చారు రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ చీఫ్ బంధు టిర్కే. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రాజీనామా చేయట్లేదని స్పష్టం చేశారు.