జిన్నా టవర్ పేరు మార్చాలి : సోమువీర్రాజు
1 min read
పల్లెవెలుగువెబ్ : గుంటూరులోని జిన్నా టవర్ పేరు మార్చాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. జిన్నా అనే వ్యక్తి పాకిస్తాన్ విభజనకు ప్రధాన కారకులని తెలిపారు. అలాంటిది… గుంటూరులో ఉన్న టవర్‌కు ఆయన పేరును వ్యతిరేకిస్తున్నామన్నారు. విషభీజాలు ప్రబలడానికి జిన్నా మనస్తత్వమే నాడు కారణమని… భారతదేశాన్ని శత్రు దేశంగా పాకిస్తాన్ నేటికీ పరిగణిస్తుందని అన్నారు. గుంటూరులో జిన్నా టవర్ పేరుతో పిలవడాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. జిన్నా పేరును తొలగించి.. దేశ స్వాతంత్ర్యం కోసం పని చేసిన వారి పేరు పెట్టాలని డిమాండ్ చేశారు.