జీవో నెంబర్ ఒకటి తక్షణమే రద్దు చేయాలి..
1 min read– డా. బీఆర్ అంబెడ్కర్ విగ్రహం ముందు టీడీపీ నిరసన.
– రాజ్యాంగ స్ఫూర్తితో జీవో రద్దు కొరకై పోరాడుదాం..
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: భారత రాజ్యాంగ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా నందికొట్కూరు పట్టణంలో గురువారం టిడిపి ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రతిజ్ఞ చేసి డా. అంబెడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టిడిపి అధికార ప్రతినిధి కాకరవాడ చిన్న వెంకట స్వామి మాట్లాడుతూ రాజ్యాంగ హక్కులు ఉల్లంఘిస్తున్నారని, నిర్బంధ పరిపాలన కొనసాగిస్తున్నారని, ప్రజా ఉద్యమాలు అణిచివేసే ధోరణిలో వైసీపీ వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కొరకు, ప్రతిపక్షం అంటే భయం వల్ల జీవో నెంబర్ వన్ అని తీసుకొచ్చారని, ఈ జీవోతో ప్రజా ఉద్యమాలు అణిచివేయలేరన్నారు. వ్యక్తి స్వేచ్ఛ కరణ భంగం కలిగే విధంగా, రాజ్యాంగాన్ని తూట్లు పొడిచే విధంగా జీవో నెంబర్ ఉందని, ప్రభుత్వానికి ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే ఈ జీవన తక్షణమే రద్దు చేయాలని అన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు ఎస్సీ, ఎస్టీ బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలు అమలు కొరకు కొన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ పథకాలు రద్దు చేశారని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన వ్యక్తిగత స్వార్థ రాజకీయ ప్రయోజనాల కొరకు, ప్రజా ఉద్యమాలను నీరుగాచేందుకు ప్రభుత్వం చేస్తున్న కుట్రలను బయట పెట్టేందుకు చేస్తున్న ఉద్యమాలు అణచివేతకు ఈ జీవోను తీసుకొచ్చారని పేర్కొన్నారు. ప్రజా ఉద్యమాలు అణిచివేసి ధోరణిలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు మొండివైఖరి ప్రదర్శిస్తున్నాయని ,రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని, ప్రజలే తగిన గుణపాఠం ప్రభుత్వానికి చెబుతారని, ఈ జీవో నెంబర్ వన్ తక్షణమే రద్దు చేయకుంటే అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భవిష్యత్తు ఉద్యమ కార్యచరణ చేపడతామని ఆయన హెచ్చరించారు.
టిడిపి కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు..
పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 74 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులు నియోజకవర్గ అధికార ప్రతినిధి కాకరవాడ చిన్న వెంకట స్వామి మాట్లాడుతూ దేశంలో బ్రిటిష్ పాలన సమయంలో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో,ప్రస్తుత జగన్ రెడ్డి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అంతకంటే ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారని అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అక్రమ కేసులు బనాయించి చిత్రహింసలు పెడుతున్నారని రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ కచ్చితంగా అధికారంలోకి రావడం తధ్యమని, ప్రతి ఒక్కరు యువ గళం పాదయాత్రను జయప్రదం చేయాలని అన్నారు. కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షుడు మున్సిపల్ కౌన్సిలరు భాస్కర్ రెడ్డి, మాజీ కౌన్సిలరు మూర్తుజావలి, టిడిపి నాయకులు నిమ్మకాయల మోహన్, రాజు, తదితరులు పాల్గొన్నారు.