అంగన్వాడి సిబ్బందికి ఉద్యోగ నియామక పత్రాలు..
1 min read– చిత్తశుద్ధితో పనిచేసి చిన్నారులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దండి..
– మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని
పల్లెవెలుగు వెబ్ ఏలూరు: చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యతో పాటుగా పౌష్టికాహారాన్ని అందించాలనే బృహత్తర లక్ష్యంతో ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేసి తమ విధులను నిర్వర్తించాలని, చిన్నారులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలని మాజీ ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్యే ఆళ్ల నాని సూచించారు. ఏలూరు నియోజకవర్గ పరిధిలోని పలు డివిజన్లలోని అంగన్వాడీ సెంటర్లకు సంబంధించి ఐదు అంగన్వాడి హెల్పర్లు, ఒక అంగన్వాడి టీచర్ కు పోస్టులకు ఎంపికైన వారికి, సంబంధిత నియామక పత్రాలను ఆళ్ల నాని చేతుల మీదుగా గురువారం అంద చేశారు. ఈ సందర్భంగా నియామక పత్రాలు అందుకున్న ఉద్యోగులు ఆళ్ల నాని కి కృతజ్ఞతలు తెలియజేశారు. తామంతా ఆళ్ల నాని కి రుణ పడి ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, వైసిపి నాయకులు నున్న కిషోర్ తదితరులు పాల్గొన్నారు.