NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

తిరుప‌తిలో జాబ్ మేళా !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఇంజనీరింగ్‌, డిగ్రీ, డిప్లొమా పూర్తిచేసినవారికి అప్రెంటిస్‌షిప్‌ కోసం జాబ్‌మేళాను నిర్వహించనున్నట్లు ఏపీ సాంకేతిక విద్య కమిషనర్‌ పోలా భాస్కర్‌ తెలిపారు. జూన్‌ 1న తిరుపతి శ్రీవేంకటేశ్వర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఉదయం 9గంటలకు జాబ్‌మేళాను ప్రారంభిస్తామన్నారు. 2019సెప్టెంబరు తర్వాత ఇంజనీరింగ్‌, డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఒరిజినల్‌ సర్టిఫికెట్లతోపాటు, ప్రొవిజినల్‌ సర్టిఫికెట్ల జిరాక్స్‌ కాపీలు 3సెట్లు, బయోడేటా తీసుకురావాలని సూచించారు. అప్రెంటిస్‌షిప్‌లో పాల్గొనే విద్యార్థులు ఎంహెచ్‌ఆర్‌డిఎన్‌ఏటిఎస్‌ వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. యూజర్‌ ఐడీ, ఇంజనీరింగ్‌ బ్రాంచ్‌ వివరాలు, ఉత్తీర్ణత అయిన సంవత్సరానికి సంబంధించిన నాలుగు సెట్ల జిరాక్స్‌లను కూడా తీసుకురావాలన్నారు. శిక్షణ కాలంలో నెలకు ఇంజనీరింగ్‌ విద్యార్థులకు రూ.9వేలు, డిప్లొమా వారికి రూ.9వేలు అందిస్తారని తెలిపారు.

                                   

About Author