ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, ఆదోని లో 19 న ఉద్యోగ మేళా
1 min read
ఆదోని , న్యూస్ నేడు : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఆదోని అర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, ఆదోని నందు ఈ నెల 19.04.2025 వ తేదీన నిరుద్యోగ యువతీ ,యువకుల కొరకు ఉద్యోగ మేళా నిర్వహించటం జరుగుతుంది.ఈ సందర్బంగా ఏం.యల్.ఏ వాల్మీకి పార్థసారథి జాబ్ మేళా పోస్టర్ ను ఆవిష్కరించి ఈ జాబ్ మేళాను నిరుద్యోగ యువత మరియు పట్టణ ప్రజలకు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేయడం జరిగింది.ఈ ఉద్యోగ మేళాలో బహుళజాతీయ 13 కంపెనీల ప్రతినిధులు పాల్గొనటం జరుగుతుంది.దీనికి జిల్లాలోని ఎఎస్ఎస్సి ఇంటర్మీడియట్, డిగ్రీ , డిప్లొమా, బి.టెక్,ఎంబీఏ పూర్తీ చేసినవారు అర్హులు.. మరియు ఈ జాబ్ మేళ కి హాజరయ్యే అభ్యర్థులు 18 సంవత్సరాలనుండి 35 సంవత్సరాల లోపు వయస్సు గలవారు అర్హులు. దీనికి ఫ్రెషర్స్ తో పాటుగా అనుభవం కలిగిన వారు కూడా అర్హులు.దీనిలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకి 12,000 /- రూపాయల నుండి 24,000/- రూపాయల వరకు జీతం ఉంటుందని మరియు ఇతర ఆలవన్సెస్ వుంటాయని, కావున జిల్లాలోని అర్హత కలిగిన నిరుద్యోగ యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలని, వారు ఈ నెల 19 ( శనివారం ) వ తేదీన నేరుగా వారి , బయో డేటా , సర్టిఫికెట్స్ తో ఇంటర్వ్యూ లకు ఆదోని అర్ట్స్ కళాశాల, ఆదోని లో హాజరు కావాలని తెలియజేశారు. ఇతర వివరాలకు 9177413642, 9703993995 నంబర్లను సంప్రదించగలరు.శ్రీ.ఎల్. ఆనంద్ రాజ్‌కుమార్, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ.కర్నూలు జిల్లా..