10 వేల మంది అంతర్జాతీయ అభర్ధుల కోసం ఉద్యోగ అవకాశాలు
1 min read
టి కన్సల్ట్, డాక్టర్ బు అబ్దుల్లా సహకారంతో అందిస్తున్న యునిక్ హైర్
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు విస్తరణ
కర్నూలు, న్యూస్ నేడు: దుబాయ్, యూఏఈ, మే 22, 2025: అంతర్జాతీయ ఐ టీ కన్సల్టింగ్, సేవల సంస్థ అయిన యూనిక్ హైర్ తాజాగా తన సేవలను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు విస్తరించింది. తద్వారా అంతర్జాతీయ విస్తరణ వ్యూహంలో ముందడుగు వేసింది. యూఏఈ బిజినెస్ ఎనేబ్లర్ అయిన టి కన్సల్ట్ సంస్థతో కలిసి వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా ఇది సాధ్యమైంది. టి కన్సల్ట్ ఛైర్మన్ సందీప్ మక్తల, ఎమిరాటీ వ్యాపారవేత్త డాక్టర్ బు అబ్దుల్లాల సమక్షంలో దీన్ని అధికారికంగా ప్రకటించారు. యూనిక్ హైర్ యూఏఈ లోగోను డాక్టర్ బు అబ్దుల్లా ఆవిష్కరించడంతో ఈ కార్యక్రమం అధికారికంగా ప్రారంభమైంది. దీంతో కంపెనీకి ఆవిష్కరణలపై ఉన్న నిబద్ధత, అంతర్జాతీయ సహకారం మరోసారి రుజువయ్యాయి. ఉన్నతస్థాయి వ్యూహాత్మక సమావేశంలో యూనిక్ హైర్ సంస్థ తన విజనరీ నియామక పద్ధతిని ఆవిష్కరించింది. తద్వారా అంతర్జాతీయంగా ఉన్న ఉద్యోగావకాశాలను అందరికీ అందిస్తోంది. “టి కన్సల్ట్, డాక్టర్ బు అబ్దుల్లాల మద్దతుతో ఈ మైలురాయి చేరుకోవడాన్ని చాలా గౌరవంగా భావిస్తున్నాం. ఈ భాగస్వామ్యం మా విలువలైన చేరిక, ఆవిష్కరణ, అంతర్జాతీయ ప్రభావం అన్నింటినీ ప్రతిబింబిస్తుంది” అని యూనిక్ హైర్ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ బాల ఎం., యూనిక్ హైర్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ వంశీకృష్ణ అన్నారు.
విభిన్నమైన అంతర్జాతీయ టాలెంట్ మోడల్
తన పేరుకు తగినట్లుగా యూనిక్ హైర్ సంస్థ నైపుణ్యం ఉన్నవారికి దేశాల సరిహద్దులు అనేవి ఒక లెక్క కాదని విప్లవాత్మకంగా నిరూపిస్తోంది. 10వేల మంది అంతర్జాతీయ అభ్యర్థులను ఎంపిక చేసుకుని, వారికి నైపుణ్యాలు సమకూర్చి ఉద్యోగాలు ఇవ్వాలన్న ప్రణాళికతో ఈ కంపెనీ ఆసియా, మధ్యప్రాచ్యం, ఇతర దేశాల్లోని పలు విశ్వవిద్యాలయాలతభాగస్వామ్యం ఏర్పాటుచేసుకోనుంది. అంతర్జాతీయ విద్యార్థులకు ఇందులో భాగంగా అత్యాధునిక శిక్షణ ఇచ్చి, వారికి టెక్నాలజీ రంగంలో ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పించనుంది. ఈ విధానం వల్ల ఇద్దరికీ ప్రయోజనం కలుగుతుంది. అంతర్జాతీయ విద్యార్థులకు అసలైన పని వాతావరణంలో అనుభవం వస్తుంది. అదే సమయంలో భారతీయ స్టార్టప్‌లు, ఎస్ఎంఈలకు అంతర్జాతీయంగా ఉన్న నిపుణులతో పనిచేయించుకునే అవకాశం వస్తుంది. దీనివల్ల ఆవిష్కరణలు, అంతర్జాతీయంగా నిపుణులైన ఉద్యోగులు లభిస్తారు. “అంతర్జాతీయ వ్యాపారాల భవిష్యత్తు అంతా సరిహద్దుల్లేని సహకారం మీదే ఆధారపడుతుంది. విద్యా వ్యవస్థలకు, కొత్తగా వస్తున్న వ్యాపారాలకు ఒక అనుసంధానంగా ఉండే ఈ కార్యక్రమం వల్ల అంతర్జాతీయంగా ఎక్కడైనా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్న నిపుణులైన ఉద్యోగులు అందుబాటులోకి వస్తారు” అని టి కన్సల్ట్ ఛైర్మన్ సందీప్ మక్తల అన్నారు.