NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎన్నిక‌ల ముందు జాబ్ రెడ్డి.. ఇప్పుడు డాబు రెడ్డి !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్నిక‌ల ముందు జాబ్ రెడ్డిగా.. త‌ర్వాత డాబు రెడ్డిగా మారార‌ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యద‌ర్శి నారా లోకేష్ విమ‌ర్శించారు. జ‌గ‌న్ విడుద‌ల చేసింది జాబ్ క్యాలెండ‌ర్ కాద‌ని, అది డాబు క్యాలెండ‌ర్ అని ఎద్దేవా చేశారు. ఎన్నిక‌ల‌ప్పుడు ఇచ్చిన హామీ ప్రకారం 2.30 ల‌క్షల ఉద్యోగాలు భ‌ర్తీ చేయాల‌ని డిమాండ్ చేశారు. గ్రూప్ 1 కు సంబంధించిన ఇంట‌ర్వ్యూలు నిలిపివేస్తూ హైకోర్టు కీల‌క ఆదేశాలు ఇచ్చిన నేప‌థ్యంలో.. గ్రూప్-1 అభ్యర్థుల‌తో ఆయ‌న వ‌ర్చవ‌ల్ ఆన్ లైన్ మీటింగ్ నిర్వహించారు. ఈ స‌మావేశంలో జ‌గ‌న్ ను విమ‌ర్శించారు. జాబ్ క్యాలెండ‌ర్ ను నిర‌సిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిర‌స‌న వ్యక్తం చేస్తున్న నిరుద్యోగ యువ‌త‌కు తెలుగుదేశం మ‌ద్దతు ఉంటుంద‌ని తెలిపారు.

About Author